వరల్డ్ కప్ లో సెమీస్ చేరుతుంది అని అంచనాలు పెట్టుకున్న నాలుగు జట్లలో పాకిస్తాన్ కూడా ఒకటి. కానీ వరల్డ్ కప్ స్టార్ట్ అయ్యి కొన్ని మ్యాచ్ లు జరిగిన తర్వాత పాకిస్తాన్ ప్రదర్శన చాలా దారుణగా ఉండడంతో సెమీస్ ఆశలు ఎవ్వరికీ లేవు. కానీ మళ్ళీ పుంజుకుని ఇప్పుడు సెమీస్ చేరుతుందేమో అన్న ఆశను కలిగించింది. ఈ రోజు జరగనున్న మ్యాచ్ తో తేలిపోనుంది. మొదటగా కోల్కతా లో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ బట్లర్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. వాస్తవంగా అయితే పాక్ టాస్ గెలిచి బ్యాటింగ్ చేసి ఎక్కువ స్కోర్ ను ఇంగ్లాండ్ కు టార్గెట్ గా ఇచ్చి తక్కువ స్కోర్ కె అవుట్ చేస్తే పాక్ కు సెమీస్ చేరడానికి అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు ఇంగ్లాండ్ బ్యాటింగ్ చేస్తుండడంతో ఇది జరిగేలా కనిపించడం లేదు. టాస్ అనంతరం బాబర్ ఆజామ్ మాట్లాడుతూ టాస్ గెలుస్తాము అనుకున్నాము..
కానీ అనుకోకుండా ఓడిపోయాము, ఇంగ్లాండ్ ను తక్కువ స్కోర్ కె అవుట్ చేసి మళ్ళీ తక్కువ ఓవర్ లలో ఛేజింగ్ చేయడానికి ప్రయత్నిస్తాము అన్నాడు. చివరగా బాబర్ మాట్లాడుతూ… సెమీస్ ఆశలన్నీ ఫఖార్ జమాన్ బ్యాటింగ్ పైనే ఆధారపడి ఉన్నాయంటూ చెప్పాడు.