లిక్కర్ స్కామ్ లో కవిత అరెస్ట్ కాకుండా ఒప్పందం జరిగింది: షబ్బీర్ అలీ

-

తెలంగాణాలో ఎన్నికలు సమీపిస్తుండడంతో నేతలు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూ హైలైట్ అవుతున్నారు. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ మంత్రి కేటీఆర్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. షబ్బీర్ అలీ మాట్లాడుతూ, కాంగ్రెస్ ఎన్నికల మానిఫెస్టోలో భాగంగా ప్రకటించిన మైనారిటీ డిక్లరేషన్ పై మాట్లాడే హక్కు కేటీఆర్ కు లేదని ఫైర్ అయ్యారు. ముఖ్యంగా ఈ డిక్లరేషన్ పై ఎటువంటి అవగాహన లేకుండా కేటీఆర్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారంటూ షబ్బీర్ అలీ మండిపడ్డారు. ఇంతకాలం యువనాయకుడు అన్న కాస్త గౌరవం అయినా కేటీఆర్ పై ఉండేది, కానీ ఎటువంటి అవగాహన లేకుండా చేస్తున్న వ్యాఖ్యలకు అది కూడా పోయిందంటూ షబ్బీర్ విమర్శించారు. ఈ ఎన్నికల్లో BRS మరియు బీజేపీ లు ఒక్కటేనని , ఎవ్వరూ నమ్మి మోసపోవద్దని ప్రజలు తెలియచేశారు షబ్బీర్ అలీ.

లిక్కర్ స్కాం లో అరెస్ట్ కావాల్సిన కవితను బీజేపీ తో ఒక ఒప్పందం కుదుర్చుకుని కాపాడుకున్నారంటూ షబ్బీర్ అలీ కీలక వ్యాఖ్యలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news