గత ఎన్నికల్లో జగన్ దెబ్బకు చంద్రబాబు-పవన్ కల్యాణ్‌లు చిత్తుగా అయిన విషయం తెలిసిందే..అటు టీడీపీ, ఇటు జనసేనలు దారుణంగా ఓడిపోయాయి. టీడీపీకి 23 సీట్లు రాగా, జనసేనకు 1 సీటు వచ్చింది. ఇలా వైసీపీ, రెండు పార్టీలకు చెక్ పెట్టింది. తర్వాత అధికార పీఠంలోకి వచ్చాక కూడా వైసీపీ హవా నడుస్తూనే ఉంది…అయితే వైసీపీకి చెక్ పెట్టడానికి టీడీపీ ఎక్కడకక్కడ ట్రై చేస్తూనే ఉంది…కానీ పెద్దగా టీడీపీకి ఛాన్స్ దొరకడం లేదు. కాకపోతే ఇటీవల వైసీపీపై కాస్త వ్యతిరేకత పెరగడం టీడీపీకి అడ్వాంటేజ్ అవుతుంది.
కొందరు వైసీపీ ఎమ్మెల్యేలపై వస్తున్న ప్రజా వ్యతిరేకత టీడీపీకి బాగా ప్లస్ అవుతుంది. అందుకే ఈ మధ్య టీడీపీ నేతలు మరింత దూకుడుగా పనిచేయడం మొదలుపెట్టారు..ఇక రానున్న రోజుల్లో ఇంకా ఎఫెక్టివ్ గా పనిచేయడానికి సిద్ధమవుతున్నారు. అయితే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు…ఎప్పటికప్పుడు పార్టీ నేతలకు గైడెన్స్ ఇవ్వడం తప్పితే…డైరక్ట్‌గా ప్రజల్లోకి వచ్చి భారీ సభలు పెట్టిన సందర్భాలు లేవు..ఏదో సమీక్షా సమావేశాలు పెట్టడం తప్ప..ప్రజా సమస్యలపై బాబు డైరక్ట్‌గా బరిలో దిగి పోరాటం చేయలేదు.
కోవిడ్ వల్ల ఆయన ప్రజల్లోకి రాలేదు…ఇక ఇప్పుడు కోవిడ్ తగ్గుతున్న నేపథ్యంలో ఇంకా బాబు ప్రజల్లోకి రావడానికి సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. వరుసగా జిల్లా వారీగా పర్యటనలు చేసి ప్రజలని కలవాలని బాబు ఫిక్స్ అయ్యారు. అలాగే భారీ సభలకు ప్లాన్ చేస్తున్నారు. అప్పుడు టీడీపీకి మరింత అడ్వాంటేజ్ అవుతుందని భావిస్తున్నారు.
అదే సమయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ సైతం..ఇకపై ప్రజల్లోనే ఉంటారని తెలుస్తోంది. ఇప్పటివరకు పవన్ అప్పుడప్పుడు మాత్రమే రాజకీయం చేయడం, ప్రజా సమస్యలపై పోరాటం చేశారు…కానీ ఇక నుంచి తరుచుగా ప్రజా సమస్యలపై పోరాటాలు చేయడం, ప్రజల్లో ఉండటం చేస్తారని తెలుస్తోంది. తాజాగా నరసాపురంలో మత్స్యకారుల సమస్యలపై భారీ సభ పెట్టి విజయవంతమైన విషయం తెలిసిందే. అలాగే సభలు ప్లాన్ చేసుకుని ముందుకెళ్లాలని చూస్తున్నారట. మొత్తానికి బాబు-పవన్‌లు ప్రజల్లోకి రావడానికి రెడీ అయిపోయారు.