మొట్టమొదటి సారిగా మూడు పురుషాంగాలతో జన్మించిన శిశివు..!

Join Our Community
follow manalokam on social media

వైద్య చరిత్రలో మొట్ట మొదటి సారిగా ఇరాక్ లో ఒక పిల్లవాడు మూడు పురుషాంగాల తో జన్మించాడు. స్క్రోటమ్ లో వాపు రావడంతో ఆ పిల్లవాడి తల్లిదండ్రులు ఆసుపత్రిలో ఎడ్మిట్ చేశారు. డాక్టర్లు పరీక్షించగా అతనికి రెండు కంటే ఎక్కువ పురుషాంగాలు ఉన్నాయని గుర్తించారు.

ఒకటి ప్రధాన పురుషాంగం నుంచి వచ్చింది. మరొకటి స్క్రోటమ్ నుండి దగ్గర ఉన్నట్టు డాక్టర్లు గుర్తించారు. ఇది చాలా వింతగా ఉందని అన్నారు. అయితే దీని కోసం పూర్తిగా స్టడీ చేశారు. ఆ పిల్లవాడు గర్భం లో ఉన్నప్పుడు ఎటువంటి డ్రగ్స్ కూడా తీసుకో లేదని జెనిటిక్ పరంగా కూడా ఈ సమస్య రాలేదని అన్నారు.

నిజంగా ఇది చాలా వింత అయినా సమస్య అని వాళ్లు గుర్తించారు. ఇప్పటి వరకు దీనికి గల కారణం ఏమిటో తెలియలేదు. 5 నుంచి 6 మిలియన్ల పిల్లల్లో ఒకరికి మాత్రమే ఇది వస్తుందని అన్నారు. అయితే ఇందులో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఇప్పటి వరకు ఒక్కరు కూడా ఇటువంటి సమస్యకి గురికాలేదు. అక్కడ ఇదే మొదటి సారి.

ఏది ఏమైనా ఒక పురుషాంగాన్ని తొలగించవచ్చు ఎందుకంటే అది మూత్రాశయం తో కనెక్ట్ అయ్యి లేదు కనుక సర్జరీ చేసి దానిని తొలగించ వచ్చు అని డాక్టర్లు చెప్పారు. అయితే ఇది Triphallia లోని మొట్ట మొదటి కేసు. డైలీ మెయిల్ ప్రకారం 2015లో భారత దేశంలో మూడు పురుషాంగాలు ఉన్న వ్యక్తి జన్మించారు. అయితే అది మెడికల్ జర్నల్ లో రికార్డ్ లో లేకపోవడంతో ఇదే మొదటి కేసు అయ్యింది.

TOP STORIES

షాకింగ్‌.. ప్ర‌తి 10 ఫోన్ల‌లో 4 ఫోన్లు సైబ‌ర్ దాడుల‌కు అనుకూలం.. నివేదిక‌లో వెల్ల‌డి..!

క‌రోనా కార‌ణంగా గ‌తేడాదిలో చాలా మంది వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ చేశారు. ఇక ప్ర‌స్తుతం కోవిడ్ కేసులు మ‌ళ్లీ పెరుగుతున్నందున ఉద్యోగులు చాలా మంది ఇళ్ల...