చిన్న సినిమాగా, ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలయ్యే చాలా సినిమాలు అద్బుతమయిన రెస్పాన్స్ ను మరియు కోట్ల రూపాయల కలెక్షన్ లను సాధించి సంచలనాన్ని సృష్టిస్తూ ఉంటాయి. ఇప్పుడు రెండు వరాల క్రితం విడుదల అయిన ఒక చిన్న సినిమా అలాంటి ఒక ఫలితాన్ని అందుకుంది అని చెప్పాలి. డైరెక్టర్ సాయి రాజేష్ ఒక చిన్న కథను తీసుకుని చాలా సులభమైన విధానంలో “బేబీ” అనే సినిమాను ప్రేక్షకులకు అందించాడు.. సాయి రాజేష్ సమకూర్చిన పాత్రలలో ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ మరియు వైష్ణవి లు చక్కగా నటించి మెప్పించారు. ఈ సినిమా తెలుగు రాష్ట్ర్రాలలో ఒక ప్రభంజనంగా మారింది. ఇక తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం బేబీ 12 రోజుల్లో రూ. 71 .6 కోట్లను కలెక్ట్ చేసి కలెక్షన్ ల సునామీని తలపిస్తోంది. ఇంకా చాలా చోట్ల ఈ సినిమాకు హౌస్ ఫుల్ బోర్డు లు కన్పిస్తున్నాయి.
మరోవారం రోజులు ఈ సినిమాకు నిలకడగా కలెక్షన్ లు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా యూత్ ఈ సినిమాకు బ్రహ్మరధం పడుతున్నారు.