టీ9-30.. టీఎస్ ఆర్టీసీ సరికొత్త పథకం

-

ప్రయాణికులకు మరింత చేరువ అయ్యేందుకు వినూత్న ప్రయోగాలు చేస్తున్న టీఎస్ ఆర్టీసీ తాజాగా ‘టి9-30 టికెట్‌’ పేరుతో మరో రాయితీ పథకం అందుబాటులోకి తీసుకువచ్చింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో స్వల్ప దూరం ప్రయాణించే వారి కోసం పల్లె వెలుగు బస్సుల్లో కొత్తగా ‘టి9-30 టికెట్’ను ప్రవేశపెట్టినట్లు ఆర్టీసీ ఛైర్మన్, బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి, సంస్థ ఎంపీ వీసీ సజ్జనార్ వెల్లడించారు. బుధవారం సంస్థ అధికారులతో కలిసి టీ9-30 టికెట్ పోస్టర్‌ను ఆవిష్కరించారు.

 

Types Of Coaches of TSRTC

రూ.50 ఛార్జీతో పల్లె వెలుగులో టిక్కెట్ తీసుకొని 30 కిలో మీటర్లు రాను, పోను ప్రయాణించవచ్చు. ఉదయం తొమ్మిది గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు ఇది చెల్లుబాటు అవుతుంది. ఈ టీ9-30 టిక్కెట్ రేపటి నుండి అందుబాటులోకి వస్తోంది. దీంతో ఒక్కొక్కరికి రూ.10 నుండి రూ.30 వరకు ఆదా అవుతుంది. పల్లె వెలుగు కోసం ఈ టిక్కెట్ తీసుకున్న తర్వాత ఎక్స్‌ప్రెస్ లోను ప్రయాణించే వెసులుబాటు ఉంది. అయితే రూ.20 కాంబినేషన్ టిక్కెట్ తీసుకొని ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణించవచ్చు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news