కొందరు స్మగ్లర్స్ బంగారాన్ని విదేశాలకు తరలించడం పైన ప్రత్యేకమైన శిక్షణలు ఏమైనా తీసుకుంటారా అనిపించే విధంగా కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి. బంగారాన్ని కడుపులో, తలలో, డ్రెస్ లో, షూస్ లో ఇలా అనేక రకాలుగా ఎలాగైనా బంగారాన్ని తీసుకు వెళ్లాలని ప్రయత్నాలు చేస్తుంటారు. ఇక తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం తెలంగాణలోని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో అక్రమంగా బంగారాన్ని తరలించడానికి చూసిన నిందితుడిని పట్టుకున్నారు. కువైట్ దేశానికి చెందిన ఒక ప్రయాణికుడు రూ. 42 లక్షల విలువైన 704 గ్రాముల బంగారాన్ని తరలిస్తుండగా పట్టుకుని స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ బంగారాన్ని ఇందులో పెట్టుకుని వచ్చాడంటే.. షాంపూ , బియ్యం మరియు సర్ఫ్ ప్యాకెట్ లలో దాచుకుని తీసుకువచ్చాడు. అయినప్పటికీ ఎయిర్ పోర్ట్ లో అధికారుల కళ్ళను కప్పలేక పట్టుబడ్డాడు. ఇదే రోజున మరో ప్రయాణికుడి దగ్గర నుండి విదేశీ కరెన్సీ ని స్వాధీనం చేసుకున్నారు.
బంగారం స్మగ్లింగ్ విషయంలో ఈ రోజు జరిగిన ఘటన చాలా మందికి ఒక ఉదాహరణ అని చెప్పాలి. మీరు ఏ విధంగా బంగారాన్ని అక్రమంగా తరలించాలి అన్నా అధికారుల నుండి తప్పించుకోలేరు.