“బ్యాక్ డోర్” మూవీ రివ్యూ

-

హీరోయిన్ పూర్ణ.. గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎక్కువగా లేడీ ఓరియంటెడ్ సినిమాలు తీస్తూ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది ఈ భామ. ఇప్పటికే రవిబాబు దర్శకత్వంలో చాలా సినిమాలు చేసిన హీరోయిన్ పూర్ణ… ప్రస్తుతం “బ్యాక్ డోర్” అనే డిఫరెంట్ కాన్సెప్ట్ ఉన్న సినిమా తో వస్తోంది. ఈ బ్యాక్ డోర్ సినిమాకు నంది అవార్డు గ్రహీత కర్రి బాలాజీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమాలో ప్రధానపాత్రలో కనిపించనుండగా… తేజ త్రిపురాన హీరోగా నటిస్తున్నారు. ఖైదీ సినిమాను క్రేజీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిర్మిస్తున్నారు.

నటీనటులు : పూర్ణ, తేజ త్రిపురాన తదితరులు

సాంకేతిక నిపుణులు : సంగీతం – ప్రణవ్, ఎడిటింగ్ – చోటా కె.ప్రసాద్, కెమెరా –
శ్రీకాంత్ నారోజ్, కో-ప్రొడ్యూసర్ – ఊట శ్రీను, నిర్మాత – బి.శ్రీనివాస్ రెడ్డి, రచన, దర్శకత్వం – కర్రి బాలాజీ

సినిమాకు కమర్షియల్ ఎలిమెంట్స్ కావాలి. అలాగే ఓ మంచి విషయాన్నీ చెప్పాలి. ఇలా మెసేజ్ ఫ్లస్ ఎంటర్ టైన్ మెంట్ కలిసి చూపించే సినిమాలు చాలా తక్కువ. అలాంటి అరుదైన చిత్రాలు వస్తే తప్పకుండా ప్రేక్షకులను మెప్పిస్తాయి. పూర్ణ హీరోయిన్ గా నటించిన కొత్త సినిమా బ్యాక్ డోర్ ఇలా సందేశం ఎంటర్ టైన్ మెంట్ కలిసి తెరపైకి వచ్చింది. ఇవాళ థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం..

కథేంటంటే

అంజలి (పూర్ణ) హౌస్ వైఫ్. ఆమె భర్త బిజినెస్ మెన్, ఎప్పుడూ ఆఫీస్ పనుల్లో బిజీగా ఉంటాడు. ఇద్దరు పిల్లలున్న అంజలి కుటుంబానికి కావాల్సిన పనులు చూసుకుంటూ సంతోషంగా గడుపుతుంది. ఓ పెళ్లిలో అరుణ్ (తేజ త్రిపురాన) అంజలికి పరిచయం అవుతాడు. అంజలి అరుణ్ ను చూసి అతని మాటలకు, సరదా వ్యక్తిత్వానికి అట్రాక్ట్ అవుతుంది. అంజలి అందానికి అరుణ్ ఫిదా అవుతాడు. అప్పటి నుంచి ఫోన్ లో రెగ్యులర్ గా టచ్ లో ఉంటారు అరుణ్, అంజలి. పిల్లలు స్కూల్ కు, భర్త ఆఫీస్ కు వె‌ళ్లిన టైమ్ లో అరుణ్ ను ఇంటికి పిలుస్తుంది అంజలి. ఆమె అందాన్ని ఆస్వాదించాలని ప్రయత్నిస్తుంటాడు అరుణ్. మనసు మాట వినని ఈ రెచ్చగొట్టే సమయంలో ఏం జరిగింది.. అంజలి గీత దాటిందా, లేక ఇల్లాలిగా తన గౌరవాన్ని కాపాడుకుందా అనేది మిగిలిన కథ.

ఫ్లస్ పాయింట్స్

పూర్ణ నటన
ప్రొడక్షన్ వాల్యూస్
సందేశాత్మక కథ
సాంకేతిక నిపుణుల ప్రతిభ

 

ఎలా ఉందంటే

ఓ మంచి కథా నేపథ్యంతో తెరకెక్కిన సినిమా బ్యాక్ డోర్. పెళ్లయ్యాక మహిళ తన మనసుకు, ఆలోచనలకు ఎలాంటి హద్దులు గీసుకోవాలో చెబుతుందీ సినిమా. చూపు వెళ్లిన ప్రతి చోటికీ మనసు వెళ్లకూడదు, మనసు వెళ్లిన ప్రతి చోటికీ మనిషి వెళ్లకూడదంటూ ట్రైలర్ లో చెప్పిన డైలాగ్ లోనే స్థూలంగా మొత్తం కథను అర్థం చేసుకోవచ్చు. వీలైనంత కమర్షియల్ గా సినిమా చూపిస్తూ..చివరలో మంచి సందేశాన్ని చెప్పారు దర్శకుడు. ఇలాంటి కథతో సినిమా చేసిన నిర్మాత బి శ్రీనివాస రెడ్డికి మంచి అభిరుచి ఉందని చెప్పుకోవాలి. అటు యువతకు నచ్చేలా, ఇటు ఫ్యామిలీ ఆడియెన్స్ ఇబ్బంది పడకుండా చక్కటి సినిమాను నిర్మించారు నిర్మాత బి శ్రీనివాస రెడ్డి.

పూర్ణ నటన బ్యాక్ డోర్ సినిమాకు ప్రాణమని చెప్పొచ్చు. ఈ సినిమాకు హైలైట్ పూర్ణనే. ఇల్లాలు అంజలి పాత్రలో హుందాగా నటిస్తూనే, మనసులో స్త్రీ తత్వాన్ని ప్రదర్శించింది. హద్దులు దాటమనే వయసుకు, తప్పని చెప్పే మనసుకు మధ్య నలిగే హౌస్ వైఫ్ గా తన నటనలో అద్భుతమైన హావభావాలు చూపించింది. ఆమె క్యారెక్టర్ లో ప్రతి ఎమోషన్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అరుణ్ క్యారెక్టర్ లో తేజ ఉత్సాహంగా నటించాడు. ఒక సగటు యువకుడి తీరు అతని నటనలో కనిపించింది.

బ్యాక్ డోర్ సినిమాలో సినిమాటోగ్రఫీ, సంగీతం వంటి టెక్నికల్ అంశాలు చాలా బలంగా ఉన్నాయి. అంజలి, అరుణ్ కలిసే ఇంటిమేట్ సీన్స్ ను సినిమాటోగ్రఫర్ శ్రీకాంత్ నారోజ్ బ్యూటిఫుల్ గా పిక్చరైజ్ చేశారు. పాటల్లో యుగాల భారత స్త్రీని పాట అంతర్మథనంతో సాగితే, రారా నన్ను పట్టేసుకుని మంచి రొమాంటిక్ సాంగ్ గా ఆకట్టుకుంది. వీకెండ్ ఓ మంచి సినిమా చూడాలనుకుంటే బ్యాక్ డోర్ బెస్ట్ ఆప్షన్

రేటింగ్ : 3/5

Read more RELATED
Recommended to you

Latest news