ఎట్టకేలకు నిర్భయ కేసు నిందితులకి ఉరిశిక్ష ఖరారు అయ్యింది. దీంతో దేశమంతా ఊపిరి పీల్చుకుని పండగ చేసుకుంటుంది. దాదాపు 8 సంవత్సరాల తర్వాత శిక్ష పడటం తో నిర్భయ తల్లి కూడా ఎంతగానో ఆనందించింది. న్యాయస్థానాల దగ్గర తన పోరాటం వృధాగా లేదని ఈ పోరాటంలో తనకు అండగా ఉన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్పుకొచ్చింది.
ఈ విధంగా రేప్ చేసిన వాళ్లని అత్యంత క్రూరంగా ఆడదాన్ని బ్రతుక నీయకుండా దారుణంగా అత్యాచారం మరియు హత్య చేసిన రేపిస్టులకు ఇన్ని సంవత్సరాలు శిక్ష పడకుండా ఉంది అంటే వ్యవస్థ ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవాలి…మొదటి నుండి ఈ కేసులో చాలా వైఫల్యాలు ఉన్నాయి అంటూ అదే పెద్ద బ్యాడ్ న్యూస్ అంటూ న్యాయ స్థానాలపై కొంతమంది కామెంట్ చేస్తున్నారు.