బ్యాంక్ కస్టమర్లకు బ్యాడ్ న్యూస్… ఎఫ్‌డీ చేసే వారిపై ప్రభావం..!

-

తాజాగా రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ మార్పుల తో రుణ గ్రహీతలకు ఊరట కలుగనుంది. ఎఫ్‌డీ చేసే వారి పై ప్రతికూల ప్రభావం పడొచ్చు. ఇక పూర్తి వివరాలని చూస్తే.. కీలకమైన పాలసీ రేట్లను యథాతథం గానే కొనసాగిస్తున్నట్టు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పడం జరిగింది. దీనితో రెపో రేటు 4 శాతంగానే ఉంది. ఇక రివర్స్ రెపో 3.35 శాతం వద్ద కొనసాగుతోంది. అయితే ఇలా ఈ వడ్డీ రేట్లను నిలకడగానే కొనసాగించడం ఇది వరుసగా 4వ సారి.

ఈ నిర్ణయం మేరకు బ్యాంక్‌లో డబ్బులు దాచుకునే వారి పై ప్రతికూల ప్రభావం పడనుంది. ఇది ఇలా ఉండగా బ్యాంకులు కూడా వడ్డీ రేట్లను అలాగే కొనసాగించే ఛాన్స్ ఉంది. కొన్ని బ్యాంకులు అయితే వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం కూడా ఉండేలా కనపడుతోంది. ఆర్‌బీఐ తీసుకున్న ఈ నిర్ణయం తో రుణ గ్రహీతలకు ఊరట కలగొచ్చు. రుణ రేట్లు పెరగకపోవచ్చు. దీంతో తక్కువ వడ్డీకే రుణాలు పొందొచ్చు.

జీడీపీ రేటు 10.5 శాతంగా ఈ ఆర్థిక సంవత్సరంలో ఉండవచ్చని ఆర్‌బీఐ అంచనా వేసింది టార్గెటెడ్ లాంగ్ టర్్ రెపో ఆపరేషన్స్ ద్వారా బ్యాంకుల నుంచి ఎన్‌బీఎఫ్‌సీలకు నిధులు అందుబాటులో ఉండేలా చూస్తామని తెలిపింది. రిటైల్ ఇన్వెస్టర్లకు బాండ్ మార్కెట్‌ను మరింత చేరువ చేస్తామని, గిల్ట్ అకౌంట్ ఓపెనింగ్ కూడా కల్పిస్తున్నట్టు చెప్పింది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news