తెలంగాణ రాష్ట్రంలోని మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. రెండు రోజులు వైన్స్ బంద్ కానున్నాయి. గణేష్ నిమజ్జనం నేపథ్యంలో హైదరాబాద్‌లో 2 రోజుల పాటు వైన్ షాప్స్ బంద్ కానున్నాయి. ఈ మేరకు మద్యం దుకాణదారులకు ఆదేశాలు జారీ చేసింది ఎక్సైజ్ అధికారులు. ఈ నెల 6న ఉదయం 6 గం. నుంచి 7న సాయంత్రం 6 గం. దాకా వైన్ షాప్స్ మూసివేయనున్నారు.

ఆదిలాబాద్‌లోనూ 4-6 తేదీల్లో ప్రాంతాల వారీగా వైన్స్ మూసివేయాలని ఆదేశాలు ఇవ్వనున్నారు. పెద్దపల్లి, మరికొన్ని జిల్లాల్లో.. 5న మద్యం షాపులు మూసివేయాలని కలెక్టర్లు ప్రకటన చేసారు.