స్టేట్ బ్యాంకులో సేవింగ్స్ ఎకౌంటు ఉన్న వారికి బాడ్ న్యూస్…!

-

ఇప్పుడు బ్యాంకులు నష్టాలు పూడ్చుకునే పనిలో ఉన్నాయి అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. తాజాగా భారత్ లో అతి పెద్ద పబ్లిక్ సెక్టార్ బ్యాంకు… స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా… సేవింగ్స్ అకౌంట్‌పై ఇచ్చే వడ్డీని తగ్గించింది. గతంలో 3 శాతంగా ఉన్న వడ్డీని 2.75 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఉదాహరణకు రూ.1,00,000 సేవింగ్స్ అకౌంట్‌లో దాచుకుంటే,

మీకు ఏడాదికి వచ్చే వడ్డీ 2.75 శాతం. 2,750 మాత్రమే వస్తుంది. ఈ వడ్డీ రేట్లు ఏప్రిల్ 15 నుంచి అమలులోకి వస్తాయని బ్యాంకు చెప్పింది. స్టేట్ బ్యాంకు వడ్డీ రేట్లు తగ్గించడం ఇది 11 వ సారి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI రెపో రేట్‌ను 75 బేసిస్ పాయింట్స్ తగ్గించిన నేపధ్యంలో స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా వడ్డీ రేట్స్ ని తగ్గిస్తుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI మార్జినల్ కాస్ట్ బేస్డ్ లెండింగ్ రేట్‌ను 0.35% తగ్గించడంతో…

ఈఎంఐలు దిగిరానున్నాయి. ఇది లోన్ తీసుకున్న వారికి కలిసి వస్తుంది. స్టేట్ బ్యాంకు లో హోమ్ లోన్, ఆటో లోన్, పర్సనల్ లాంటి రుణాలు తీసుకున్నవారందరికీ ఇది వర్తించనుంది. ఏడాది ఎంసీఎల్ఆర్ 7.75 శాతం నుంచి 7.40 శాతానికి దిగిరానుంది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఎస్‌బీఐ వడ్డీని తగ్గించడం వరుసగా ఇది 11వ సారి కావడం గమనార్హం. ఈ కొత్త వడ్డీ రేట్లు 2020 ఏప్రిల్ 10 నుంచి అమలులోకి రానున్నాయి. హోం లోన్ 30 ఏళ్ల లోన్‌పైన రూ.1,00,000 పై రూ.24 చొప్పున ఈఎంఐ తగ్గుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news