చాలా దేశాలకు మన మందులే దిక్కు…!

-

అవును కరోనా సాయంలో మన దేశం చాలా ముందు ఉంది… చాలా వరకు మన మందులతోనే కరోనా వైరస్ ఇప్పుడు నయం అవుతుంది అని అగ్ర దేశాలు, అభివృద్ధి చెందిన దేశాలు ఎక్కువగా నమ్ముతున్నాయి. మన దేశంలో కరోనా వైరస్ ఎక్కువగానే ఉన్నా… ప్రపంచ దేశాలు మాత్రం మన సాయం ఎక్కువగా కోరుతున్నాయి. అమెరికా కూడా మన సాయం కోసం చివరికి బెదిరించే స్థాయికి వెళ్లిపోయింది.

అమెరికాలో ఇప్పుడు మలేరియా కు వాడే మందు కావాలని… అది అయితేనే కరోనా వైరస్ ని కట్టడి చేసే అవకాశం ఉంటుందని అక్కడి ప్రభుత్వం భావిస్తుంది. ఉదయం లేస్తే మన దేశం మీద ఎప్పుడు బాంబులు వేద్దామా అని చూసే పాకిస్తాన్ కూడా ఇప్పుడు కరోనా సాయం కోసం మన దేశాన్ని అడుగుతుంది. మన దేశంలో కరోనా కు వాడే రోగ నిరోధక శక్తి పెంచే ఔషధాలు తమకు కావాలని కోరుతుంది.

ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇప్పటికే మన దేశ ప్రధానిని కోరినట్టు తెలుస్తుంది. ఇక యూరప్ దేశాలు కూడా మన దేశం ముందు సాయం కోసం నిలబడుతున్నాయి. తమ తమ దేశాల్లో మందుల కొరత ఎక్కువగా ఉందని దయచేసి భారత్ వాటిని అందించాలి అని కోరుతున్నారు. ఇటలీ స్పెయిన్ సహా కొన్ని దేశాలు ఇప్పుడు కరోనా విషయంలో మాకు భారత్ అండగా నిలవాలి అని కోరుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news