సీనియర్ సిటిజన్లకు బ్యాడ్‌న్యూస్.. ఇక నుండి ఇవి వుండవు..!

-

కరోనా వలన ఎన్నో కష్టాలు వచ్చాయి. అందుకోసం ప్రజలకి సహాయంగా కొన్ని స్కీమ్స్ వంటివి వచ్చాయి. సీనియర్ సిటిజన్లకు సాయంగా పలు బ్యాంకులు స్పెషల్ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌లను తీసుకొచ్చాయి. సీనియర్ సిటిజన్ల కోసం ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ మొదలైన బ్యాంకులు స్పెషల్ ఎఫ్‌డీ స్కీమ్‌లను ప్రవేశ పెట్టాయి. ఆ తరవాత వీటి డెడ్ లైన్ ని ఎక్స్టెండ్ కూడా చేసారు.

money
money

60కి పైగా వయసున్న వారి కోసం రెండేళ్ల క్రితం తీసుకొచ్చిన ఈ స్పెషల్ ఎఫ్‌డీ స్కీమ్‌లను మూసివేస్తున్నారు. పూర్తి వివరాల లోకి వెళితే.. బ్యాంకు, బ్యాంకు ఆఫ్ బరోడాలు సీనియర్ సిటిజన్ల కోసం తెచ్చిన ఈ స్కీమ్స్ ని మూసేస్తున్నారు. ఏప్రిల్ 1 నుంచి ఈ ఎఫ్‌డీ స్కీమ్‌లు ఉండవు. రెండేళ్ల క్రితం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు సీనియర్ సిటిజన్ కేర్ ఎఫ్‌డీని తీసుకొచ్చింది.

5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల కి చేసే ఫిక్స్‌డ్ డిపాజిట్ల కోసం సీనియర్ సిటిజన్లకు అందించే వడ్డీ రేటుకు మరో 25 బేసిస్ పాయింట్ల ఎక్కువ వడ్డీని ఆఫర్ చేస్తూ దీనిని తీసుకొచ్చింది. ఇది సీనియర్ సిటిజన్స్ కి బెనిఫిట్ గా ఉండేది. కానీ ఇప్పుడు ఏప్రిల్ 1 2022 నుంచి ఈ స్కీమ్ డెడ్‌లైన్ ముగుస్తోంది. ఎక్స్టెండ్ చేసే అవకాశం లేనట్టే వుంది.

ఇది ఇలా ఉంటే బ్యాంకు ఆఫ్ బరోడా కూడా 60 ఏళ్లకు పైబడిన వారికి స్పెషల్ ఎఫ్‌డీ స్కీమ్‌ను ఆఫర్ చేసింది. 60 ఏళ్ల పైబడిన వ్యక్తి అయితే అదనంగా ఎఫ్‌డీలపై 1 శాతం వడ్డీని ఇచ్చింది. డిపాజిటర్ 60 ఏళ్లపైబడిన వ్యక్తి అయితే వడ్డీ రేటు 6.35 శాతం ఎక్కువ వడ్డీని పొందవచ్చు. ఇది కూడా సీనియర్ సిటిజన్స్ కి ప్లస్ అయ్యేది. కానీ ఎఫ్‌డీ స్కీమ్ డెడ్‌లైన్ కూడా మార్చి 31, 2022తో ముగుస్తుంది. ఎక్స్టెండ్ చేసేలా లేదు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news