ట్రెండ్ ఇన్ : ‘బీస్ట్’ ట్రైలర్ రిలీజ్ చేయాలంటున్న విజయ్ అభిమానులు..

-

కోలీవుడ్ స్టార్ హీరో ఇళయ దళపతి విజయ్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకానొక సమావేశంలో తమిళ్ తలైవా, సూపర్ స్టార్ రజనీకాంత్ నెక్స్ట్ సూపర్ స్టార్ విజయేనని పేర్కొన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సంగతులు అలా ఉంచితే..విజయ్ నటించిన సినిమాలు విడుదలవుతున్నాయంటే చాలు.. అభిమానులు ఎక్కడా లేని హడావిడి చేసేస్తుంటారు. సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతూనే థియేటర్స్ వద్ద సందడి చేస్తుంటారు. ఈ క్రమంలోనే వచ్చే నెల 13న విజయ్ నటించిన ‘బీస్ట్’ చిత్రం విడుదల కానుంది.

నెల్సన్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. సెన్సేషనల్ అండ్ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ ఈ ఫిల్మ్ కు మ్యూజిక్ డైరెక్టర్ కాగా, విజయ్ కు జోడీగా టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజా హెగ్డే నటించింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ‘అరబిక్ కుత్తు, జాలీ ఓ జింఖానా’ సాంగ్స్ యూట్యూబ్ లో ట్రెండింగ్ లో నిలవడమే కాదు రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. ఈ పాటలకు టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేయగా, వాటికి మంచి రెస్పాన్స్ వస్తోంది.

‘బీస్ట్’ చిత్రంలోని పాటలు హైలైట్ అవుతున్నాయి. కానీ, ఈ చిత్రం నుంచి మూవీ మేకర్స్ టీజర్ రిలీజ్ చేయలేదు. ఈ నేపథ్యంలోనే విజయ్ అభిమానులు చిత్ర టీజర్ రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తూ మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ లో #WeWantBeastTeaser హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు. టీజర్ విడుదల చేయాలని ట్వీట్స్ చేస్తూనే ఉన్నారు.

తమిళ్ భాషతో పాటు మరో నాలుగు భాషల్లో విడుదలవుతున్న చిత్ర టీజర్ ను వెంటనే రిలీజ్ చేయాలని మూవీ మేకర్స్ ను కోరుతున్నారు విజయ్ అభిమానులు. ఫిల్మ్ సెన్సార్ అయినట్లు, మూవీకి యూ బై ఏ సర్టిఫికెట్ వచ్చినట్లు తెలుస్తోంది. చూడాలి మరి.. డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్..విజయ్ అభిమానుల కోరిక మేరకు టీజర్ విడుదల చేస్తారా? లేదా వచ్చే నెల 13న డైరెక్ట్ గా సినిమాను థియేటర్స్ లో విడుదల చేస్తారో..

Read more RELATED
Recommended to you

Latest news