టీడీపీ కి ఇది చావుదెబ్బ ? :: బి‌సి లకి బంగారం లాంటి వార్త !

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగడంతో ప్రధాన పార్టీలన్నీ వ్యూహాలకు సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఏపీలో రాజకీయ మొత్తం స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ చుట్టూ తిరుగుతుంది. విషయంలోకి వెళితే వైయస్ జగన్ ప్రభుత్వం బీసీలకు 59.85 శాతం రిజర్వేషన్లను కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు ఇటీవల తప్పు పట్టడం జరిగింది. అయితే హైకోర్ట్ కి బీసీల రిజర్వేషన్ అంశంలో ప్రతాపరెడ్డి అనే వ్యక్తి పిటిషన్ వేసి జగన్ ప్రభుత్వానికి ఝలక్ ఇవ్వడం జరిగింది. అయితే ప్రతాప రెడ్డి అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తి అని, అంతేకాకుండా కర్నూలు జిల్లాలో ఉపాధి హామీ పథకానికి సంబంధించి టిడిపి తరఫున పదవి కూడా చేసినట్లు వార్తలు బయటకు వచ్చాయి. అదే సమయంలో నారా చంద్రబాబు నాయుడుతో పాటు నారా లోకేష్ తో కూడా దిగిన ఫోటోలు బయటపడటంతో హైకోర్టులో చంద్రబాబు ప్రతాపరెడ్డి చేత పిటిషన్ వేయించి అడ్డుపడినట్లు మొత్తం విషయం తేలింది. దీంతో వైసిపి పార్టీ హైకోర్టు ఆదేశాల మేరకు గతంలో మాదిరిగా ప్రభుత్వాలు ఏ విధంగా స్థానిక ఎలక్షన్ లో రిజర్వేషన్లు కేటాయించడం జరిగిందో అయ్యే నిబంధనలు అమలు చేయడానికి రెడీ అయింది.

 

ఇదే సమయంలో కొత్తగా పార్టీ తరఫున అదనంగా బీసీలకు 10 శాతం రిజర్వేషన్లు ఇచ్చి టిక్కెట్లు కేటాయిస్తామంటూ బంగారం లాంటి వార్త చెప్పి వైఎస్సార్సీపీ సంచలన ప్రకటన చేసింది. ఈ ప్రకటనతో బీసీలు వైసిపి పార్టీ పై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. అంతేకాకుండా కోర్టులో చంద్రబాబు ఆపిన, పార్టీ తరఫున మాకు రిజర్వేషన్లు కల్పించి బీసీలపై జగన్ కి ఉన్న ప్రేమను చాటుకున్నాడు అంటూ బీసీ నాయకులు తెగ పొగుడుతున్నారు. దీంతో కచ్చితంగా ఇది తెలుగుదేశం పార్టీకి చావుదెబ్బ అని….ఇప్పుడు బీసీల ద్రోహిగా చంద్రబాబు మిగిలిపోయాడు అంటూ రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version