ఏపీలోని పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలోని రైల్వే స్టేషన్‌లో చాలా కాలంగా కొనసాగుతున్న పార్శిల్ కేంద్రాన్ని ఎత్తివేశారు. నవంబర్ 1వ తేదీ నుంచి పార్శిల్ బుకింగ్‌లను కూడా నిలిపివేశారు. ఇక్కడి నుంచి ఇదివరకు బెంగళూరు, గోవా, కాచిగూడ, మహబూబ్ నగర్, జడ్చర్ల, అలంపూర్, శంషాబాద్, కడప, కర్నూలు, అనంతపురం, తిరుపతి వంటి ప్రాంతాలకు పార్శిల్ సేవలు అందించేవారు.
రైల్వే అధికారుల తాజా నిర్ణయంతో ఇకపై ఆ సౌలభ్యం ఉండదు. పల్నాడు ప్రాంత వాసులు ఇకపై లగేజీ బుక్ చేయాలనుకుంటే గుంటూరు కేంద్రంలోని పార్శిల్ ఆఫీసుకు వెళ్లాల్సి ఉంటుంది. రైల్వేస్టేషన్‌లో కొత్తగా సౌకర్యాలు కల్పించాల్సింది పోయి ఏకపక్షంగా అధికారులు ఈ నిర్ణయం తీసుకోవడంపై ప్రయాణికులు మండిపడుతున్నారు.తక్షణమే స్థానిక ఎంపీ, రాజ్యసభ సభ్యులు వెంటనే స్పందించి పార్శిల్ కేంద్రాన్ని తిరిగి ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.