భారత క్రికెటర్లలో అత్యంత ప్రతిభవంతమైన వికెట్ కీపర్లలో ఇషాన్ కిషన్ ఒకరు. ఈ మధ్య కాలంలో అతను నిత్యం వివాదాల్లో చిక్కుకుంటున్నారు. తాజాగా ఆస్ట్రేలియా-ఏ, ఇండియా-ఏ మ్యాచ్ లో ఇషాన్ కిషన్ బంతి మార్పు పై అంపైర్ తో వాగ్వాదానికి దిగారు. మార్చిన బంతితోనే ఆడాలని ఆంపైర్ చెప్పగా.. ఇషాన్ కిషన్ కాస్త అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. తెలివి తక్కువ నిర్ణయం అంటూ కామెంట్ చేశారు.
మీ వల్లనే బంతి దెబ్బతింది. మీ ప్రవర్తన అనుచితం అని ఇషాన్ కిషన్ ఎంఫైర్ కి వార్నింగ్ ఇచ్చాడు. ఇషాన్ కిషన్ చేసిన ఆ కామెంట్ ఇప్పుడు వివాదానికి దారి తీసింది. అంపైర్ బాల్ టాంపరింగ్ ఆరోపణలు నిజమని తేలితే.. ఇషాన్, పలువురు ఆటగాళ్ల పై వేటు పడే ప్రమాదం పొంచి ఉంది. 2023 దక్షిణాఫ్రికా పర్యటనలో చివరగా భారత జట్టులో ఉన్నాడు ఇషాన్ కిషన్. అయితే అతను మధ్యలోనే నిష్క్రమించాడు. బ్యాటర్ వ్యక్తిగతంగా విరామం తీసుకున్నాడని.. అది BCCIకి బాగా నచ్చలేదు. ఐపీఎల్‌కు ముందు దేశవాళీ పోటీలను దాటవేయాలని ఆటగాడు నిర్ణయించుకున్న తర్వాత.. BCCI అతన్ని సెంట్రల్ కాంట్రాక్ట్ నుండి తొలగించిన విషయం తెలిసిందే.