ఈ స్కీమ్స్ లో డబ్బులు పెట్టిన వారికి బ్యాడ్‌న్యూస్..!

-

కేంద్రం ఎన్నో స్కీమ్స్ ని ఇస్తోంది. ఈ స్కీమ్స్ వలన ఎన్నో లాభాలను పొందొచ్చు. చాలా మంది డబ్బులని నచ్చిన స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. దీని వలన భవిష్యత్తులో సమస్యలేమీ కలగకుండా ఉంటాయి. అయితే కేంద్రం అందించే స్కీమ్స్ లో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, సుకన్య సమృద్ధి కూడా వున్నాయి.

money

అయితే ఈ స్కీమ్స్ లో చాలా మంది డబ్బులు పెడుతున్నారు. మీరు కూడా ఇందులో డబ్బులు పెడుతున్నారా…? అయితే తప్పకుండా ఇది చూడాలి. మిగిలిన స్కీమ్స్ యొక్క వడ్డీ రేట్లను పెంచింది. కానీ పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ కి మాత్రం పెంచలేదు.

పీపీఎఫ్ వడ్డీ రేటును కేంద్ర ప్రభుత్వం 7.1 శాతం గానే ఉంచింది. అలానే నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ వడ్డీ రేటును 6.8 శాతంగానే ఉంచింది. సుకన్య సమృద్ధి యోజన అయితే 7.6 శాతం వద్దనే వుంది. అయితే చాలా మంది పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ స్కీమ్‌ల లో డబ్బులు పెడుతూ వుంటారు. కానీ వీటి వడ్డీ రేట్లను పెంచకపోతే ఇన్వెస్టర్లకు కష్టంగా ఉంటుంది. పైగా స్థిరంగా కొనసాగడం వలన ఈ స్కీమ్స్ లో డబ్బులు పెట్టె వాళ్ళు నిరాశ కి గురవుతున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version