కొద్ది రోజుల క్రితమే కేదార్ నాధ్ ఆలయానికి విచ్చేసిన ఇద్దరు ప్రేమికులు ఫోటోలు మరియు వీడియోలు తీసుకుంటూ అభ్యంతరకమైన పోజులు ఇవ్వడంతో ప్రేక్షకులు మరియు కేదార్నాథ్ ఆలయ నిర్వాహకులు దీనిని తీవ్రంగా ఖండించారు. అయితే కొందరు వీరికి మద్దతుగా కూడా నిలబడం విశేషం. ఈ ఘటనను ఆధారంగా తీసుకుని ఈ ఆలయం పరిసరాలలో ఫోటోలు లు కానీ , వీడియోలు కానీ తీసుకోవడానికి వీలు లేదు అంటూ కఠినమైన నిర్ణయాన్ని బద్రీనాథ్ ఆలయం కమిటీ తీసుకుంది. దీనిని పూర్తిగా అమలులోకి తీసుకురావడానికి ఆలయ ప్రాంగణంలో మరియు చుట్టుపక్కల హెచ్చరిక బోర్డు లను కూడా ఏర్పాటు చేసింది. దీనితో ఇకపై బద్రీనాధ్ ను దర్శించుకోవాలంటే ఫోన్ లు తీసుకువచ్చినా , ఫోటోలు తీయకుండా ఉండాలి. మరి దీనిపై బద్రీనాధ్ భక్తుల నుండి ఎటువంటి స్పందన రానుంది మరియు
ఈ నియమనిబంధనలపై ఎంతకాలం నిలబడి ఉంటారు అన్నది తెలియాల్సి ఉంది. ఈ నిర్ణయం తెలిసిన భక్తులు ఆ ప్రేమజంట అలా చేసి ఉండకపోతే ఇప్పుడు ఈ రూల్ తీసుకుని ఉండకపోదురు అంటూ ఫీల్ అవబుతున్నారు.