డిపాజిట్ కోల్పోవ‌డం అంటే..? హుజురాబాద్, బద్వేల్‌లో కాంగ్రెస్‌కు డిపాజిట్ గల్లంతు!

-

తెలుగు రాష్ట్రాల్లో రెండు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది. బద్వేల్‌లో వైసీపీ అభ్యర్థి డాక్టర్ కె.సుధ విజయం ఖరారైంది. సమీప బీజేపీ అభ్యర్థిపై ఆమె 90,0043 ఓట్ల మెజారిటీతో దూసుకుపోతున్నారు. మరోవైపు హుజురాబాద్‌‌లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ప్రతి రౌండ్‌లో స్వల్ప మెజారిటీ సాధిస్తూ వస్తున్నారు. తన సమీప టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌పై ఈటల రాజేందర్ 2వేల పైచిలుకు మెజారిటీతో కొనసాగుతున్నారు. బద్వేల్, హుజురాబాద్ రెండు స్థానాల్లోనూ కాంగ్రెస్ పార్టీ గల్లంతైంది. కనీసం డిపాజిట్‌ కూడా దక్కించుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో ఒక అభ్యర్థికి ఎన్ని ఓట్లు వస్తే డిపాజిట్ వస్తుందో తెలుసుకుందాం

congress

డిపాజిట్ దక్కించుకోవడం (లేదా) కోల్పోవడం

దేశంలో జరిగే ఏ ఎన్నికల్లో అయినా పోటీచేసిన అభ్యర్థికి పోలై చెల్లుబాటైన ఓట్లలో 1/6 వంతు వస్తే డిపాజిట్ దక్కినట్లుగా ప్రకటిస్తారు. అంతకంటే తక్కువ ఓట్లు వస్తే డిపాజిట్ కోల్పోయినట్లు లెక్క. అంటే, అసెంబ్లీ ఎన్నికల్లో లక్ష ఓట్లు వస్తే దాదాపు 16,666 ఓట్లు వస్తే డిపాజిట్ వస్తుందన్న మాట.

ఎమ్మెల్యే స్థానానికి డిపాజిట్ ఎంతంటే?

ఎమ్మెల్యే పదవికి పోటీ చేసే ఎస్సీ, ఎస్టీలు రూ.5 వేలు, ఓసీలు, బీసీలు, మైనార్టీలు రూ.10 వేల డిపాజిట్‌ చెల్లించాలి. పోలై చెల్లిన ఓట్లలో 1/6 వంతు ఓట్లు రాబట్టుకోకపోతే ఈ డిపాజిట్ మొత్తాన్ని తిరిగి ఇవ్వరు.

Read more RELATED
Recommended to you

Exit mobile version