బక్రీద్ బుధవారమే

 

రుహియతే హిలాల్ కమిటీ నిర్ధారణ

ఈద్-ఉల్-జుహ (బక్రీద్) పండుగను 22వ తేదేనే జరుపుకోవాలని రుహియతఏ హిలాల్ (నెలవంక నిర్ధారణ) కమిటీ సోమవారం సాయంత్రం ప్రకటించింది. ఇస్లామియా క్యాలెండర్ని అనుసరించి ప్రతీ ఏటా జిల్ హజ్ నెలలో నెలవంక కనిపించిన పదో రోజు ఈ పండుగ జరుపుకుంటామని దీంతో ఈ నెల 22న బక్రీద్ నిర్వహించాలని కమిటీ అధ్యక్షుడు మౌలానా ఖుబ్బుల్ పాషా ఖుత్తారీ పేర్కొన్నారు. గతేడాది నవంబర్ 24న జారీ చేసిన ఉత్తర్వుల్లో  ఆగస్టు 22వ తేదీని సాధారణ సెలవుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.