వాట్ ఆన్ ఐడియా… ఈ స్వీట్ కేజీ ధర ఎంతో తెలిస్తే మీ కళ్లు బైర్లుకమ్మాల్సిందే..!

-

- Advertisement -

సాధారణంగా ఓ కిలో స్వీట్ ధర ఎంతుంటుదండి? మా.. అంటే 400 రూపాయలు.. మరీ క్వాలీటీ ఉన్న స్వీట్ అయితే.. ఓ వెయ్యి.. ఇంకా రకరకాల డ్రై ఫ్రూట్స్ తో చేసినదైతే రెండు వేలు.. ఇక అంతకు మించి మాత్రం ఉండే సమస్యే లేదు.. ఏమంటారు. అవును.. అవును.. అంటారా? కానీ.. గుజరాత్ లోని సూరత్ లో ఉన్న ఓ స్వీట్ షాప్ లో కిలో స్వీట్ ధర ఎంతో చెబితే వెంటనే మీ కళ్లు తిరిగి కిందపడిపోతారు. కిందపడిపోతే లేపడానికి పక్కన వేరేవాళ్లు ఉన్నారులే కాని.. నువ్వు ముందు అసలు విషయం చెప్పూ.. అంటారా.. పదండి తెలుసుకుందాం.

ఇప్పుడు దగ్గర్లో ఉన్న పండుగ రక్షా బంధన్. రాఖీలతో పాటు స్వీట్లకు కూడా ఈ పండుగలో ప్రాధాన్యత ఇస్తారు. సోదరీమణులు తమ సోదరులకు రాఖీ కట్టిన అనంతరం స్వీట్లు తినిపిస్తారు. కాబట్టి.. రాఖీల సమయంలో స్వీట్లకు గిరాకీ కూడా బాగానే ఉంటుంది. అయితే.. సూరత్ లో ఉన్న ఓ స్వీట్ షాప్ వాళ్లకు ఓ ఆలోచన వచ్చింది. ఎప్పుడూ ఆ పాత చింతకాయ పచ్చడిలా అవే స్వీట్లు తయారు చేసి మనకూ బోరు కొడుతున్నది.. కస్టమర్లకూ బోరు కొడుతున్నదని అనుకున్నారేమో కానీ.. కొత్త రకం స్వీట్లను తయారు చేశారు. దానికి గోల్డ్ స్వీట్ అని పేరు పెట్టారు. పేరుకు తగ్గట్టుగానే స్వీట్ మీద 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారపు పూతను పూశారు. మరి గోల్డ్ అంటే తక్కువ రేటు ఉండదు కదా. అందుకే.. ఆ స్వీట్ కు కిలో 9000 రూపాయలు పెట్టారట.

ఎహె.. ఊరుకోండి.. 9000 రూపాయలు పెట్టి కిలో స్వీట్ కొనేవాళ్లు ఉన్నారా ఈరోజుల్లో అని చిరాకుపడకండి. ఎందుకంటే.. గోల్డ్ స్వీట్ గురించి సూరత్ అంతా తెలిసి ఆ స్వీట్లను కొనడానికి స్వీట్ షాపుకు క్యూ కడుతున్నారట జనాలు. దేవుడోయ్.. జనాలు అస్సలు డబ్బుల గురించే ఆలోచించట్లేదన్నమాట. ఇక.. ఈ స్వీట్లతో పాటు ఆ షాపుకు కూడా కావాల్సినంత ప్రచారం లభించిందట. వాట్ ఆన్ ఐడియా సర్జీ….

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...