బక్రీద్ పండుగను ముస్లిం సోదరులు ఎంత ఘనంగా జరుపుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ప్రస్తుతం కరోనా వైరస్ దృశ్య బక్రీద్ పండుగ ఘనంగా జరుగుతుందా లేదా అనే అనుమానం మొదలైంది. ఆగస్టు 1వ తేదీ నుంచి మూడు రోజులపాటు బక్రీద్ పండగ జరగనున్న నేపథ్యంలో జిహెచ్ఎంసి అధికారులతో హోం మంత్రి మహమ్మద్ అలీ సమావేశమయ్యారు. బక్రీద్ పండుగ సందర్భంగా బలి ఇచ్చే జంతువుల వ్యర్థాలను తొలగించేందుకు జీహెచ్ఎంసీ అధికారులు సిద్ధమైనట్లు హోం మంత్రి మహమ్మద్ అలీ తెలిపారు.
అయితే రానున్న బక్రీద్ పండుగ ప్రత్యేక పరిస్థితుల మధ్య జరగనుంది అంటూ చెప్పుకొచ్చారు హోం మంత్రి మహమ్మద్ అలి. కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తిచెందిన దృశ్య ముస్లిం సోదరులు బక్రీద్ పండుగ జరుపుకోవడంలో ప్రత్యేక శ్రద్ధ వహించి తగిన జాగ్రత్తలు తీసుకొని జరుపుకోవాలి అని సూచించారు. ప్రతి ఒక్కరు కూడా బౌతిక దూరం పాటించాలని పిలుపునిచ్చారు. ఇంట్లోనే ప్రార్థన చేసుకోవాలి అంటు సూచించారు హోమ్ మంత్రి మహమ్మద్ అలీ.