బాలయ్య బాబు పంచ్ డైలాగ్స్, ఫైట్స్ సూపర్..!!

-

నందమూరి బాలకృష్ణ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న సినిమా వీరసింహారెడ్డి.పేరు వింటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి కదా. ఇక ఇందులో  యాక్షన్ సన్నివేశాల ఎలివేషన్స్  బోయపాటిని సైతం దాటిపోయాయని టాక్ నడుస్తోంది ఆ సినిమాకి పని చేసిన స్టంట్ మాస్టర్స్ ఆధ్వర్యంలోనే  గోపీచంద్ మలినేని అన్ని యాక్షన్  సన్నివేశాలను షూట్ చేసినట్లు తెలుస్తోంది.

ఇందులో ఫైట్స్ లో బాలయ్య అఖండ ను మించిన ఎనర్జీ తో చేశారని అంటున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా లో 9 ఫైట్స్ ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికి అఖండ ఫైట్స్ గుర్తుకు వస్తే గుండెలు అదిరి పోతాయి. ఇక వాటికి స్టైలిష్ యాక్షన్ కలిపి ఇంకా సూపర్ గా ఫైట్స్ తీసారట. సినిమాలో వచ్చే అన్ని ఫైట్లు కూడా దేని కదే డిఫరెంట్ థీమ్ తో స్పెషల్ గా ఉంటాయట.

ఇక బాలయ్య బాబు డైలాగ్స్ చెబుతుంటే థియేటర్లు దద్ధరిల్లి పోతాయట. ఆయన నోటి నుంచి వచ్చే కొన్ని డైలాగ్స్ ప్రభుత్వాలను చీల్చి చెండాడేల ఉన్నాయట. అది కూడా కూడా ఏదో విమర్శ చేశాము అనేలా కాకుండా జరుగుతున్న తప్పులను వేలెత్తి చూపే అవకాశం ఉందని అంటున్నారు.అలాగే సినిమా లో వరలక్ష్మి శరత్ కుమార్ తో వచ్చే సీన్ పంచ్ డైలాగ్స్ తో బాలయ్య బాబు చెలరేగి పోతారట. ఈ సినిమా కోసం బాలయ్య బాబు ఫ్యాన్స్ ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు

Read more RELATED
Recommended to you

Latest news