ఆ హీరోల దెబ్బ‌తో బాల‌య్యకు క‌ష్టాలే…

-


సంక్రాంతి సీజన్ వస్తుందంటే టాలీవుడ్‌లో సినిమా హంగామా మామూలుగా ఉండ‌దు. అసలు సీజ‌న్ మొత్తం మీద సంక్రాంతి సీజ‌నే టాలీవుడ్‌లో పెద్ద సీజ‌న్. ఇక సంక్రాంతి సీజ‌న్ ఉందంటే యువ‌ర‌త్న నందమూరి బాలకృష్ణ సినిమాలు పక్కాగా ఉంటాయి. సంక్రాంతి బరిలో ఎన్నో విజయాలను అందుకున్న బాలయ్యని సంక్రాంతి రారాజు అని కూడా అంటుంటారు. బాల‌య్య కెరీర్‌లో పెద్ద బ్లాక్ బ‌స్ట‌ర్లు అయిన స‌మ‌ర‌సింహారెడ్డి, న‌ర‌సింహానాయుడు, ల‌క్ష్మీ న‌ర‌సింహా లాంటి సినిమాలు సంక్రాంతికే వ‌చ్చాయి.

ఇక గ‌త మూడు సంక్రాంతిలు చూస్తే డిక్టేట‌ర్‌, గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి, జై సింహా సినిమాల‌తో వ‌రుసగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి హిట్ కొట్టాడు. కానీ అలాంటి బాలయ్యకి సంక్రాంతి 2020లో ప్లేస్ దక్కకపోవడం చాలా బాధాకరం. ప్రస్తుతం బాలకృష్ణ కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా నవంబర్ కల్లా షూట్ ఫినిష్ చేసుకున్నా సంక్రాంతి బరిలో నిలవడం లేదు. దీనికి ఇప్ప‌టికే చాలా మంది యంగ్ హీరోల సినిమాలు షెడ్యూల్ అయ్యి ఉండ‌డ‌మే.

ఇప్ప‌టికే సంక్రాంతి రేసులో సరిలేరు నీకెవ్వరూ, అల వైకుంఠపురంలో, ఇంతమంచి వాడవురా, దర్భార్ లాంటి సినిమాలు లాక్ అయ్యాయి. థియేటర్స్ ఇబ్బంది వస్తుందని డిసెంబర్ లోనే క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేద్దాం అనుకున్నారు. క్రిస్మ‌స్‌కు కూడా చాలా పోటీ ఉంది. ‘ప్రతిరోజు పండగే’, ‘భీష్మ’, ‘డిస్కో రాజా’, ‘నిశ్శబ్దం’ లాంటి సినిమాలు పోటీ పడుతున్నాయి. అప్పుడు కూడా థియేట‌ర్ల ఇబ్బంది త‌ప్ప‌దు.

అంటే న‌వంబ‌ర్‌కు షూటింగ్ కంప్లీట్ అయ్యే సినిమా క్రిస్మ‌స్‌, సంక్రాంతి సీజ‌న్ వ‌దులుకుని ఏ శివ‌రాత్రికో వెళ్లిపోవాల్సి ఉంటుంది. రూలర్ అనే టైటిల్ పరిశీలిస్తున్న ఈ సినిమాలో వేదిక, సోనాల్ చౌహాన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news