కొత్త పార్లమెంటరీ సబార్డినేట్ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ గా వల్లభనేని బాలశౌరి నియామకం అయ్యారు. గతంలో స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ గా ఉన్న రఘు రామకృష్ణ రాజు స్థానంలో ఛైర్మన్ గా బాలశౌరి నియామకం అయ్యారు. ఏడాది పాటు ఛైర్మన్ గా ఉన్న రఘు రామకృష్ణ రాజు పార్టీకి వ్యతిరేకంగా మారిన సంగతి తెలిసిందే. దీంతో ఆయనని తప్పించింది పార్టీ. ఇక 15 మంది సభ్యులతో స్టాండింగ్ కమిటీని లోకసభ స్పీకర్ ఓం బిర్లా నియామకం చేశారు.
వల్లభనేని బాలశౌరి కాంగ్రెస్ హయాంలో వైఎస్ కి అత్యంత అనుకూల వ్యక్తిగా గుర్తింపు పొందారు. దీంతో ఈయనను వైఎస్‌కు స్నేహితుడిగా కూడా పేర్కొనేవారు. అయితే, వరుస పరాజయాలతో ఆయన ప్రజల్లో పెద్దగా గుర్తింపు సాధించలేక పోయారు. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ఆయన చివరిగా 2004లో తెనాలి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. ఇక తాజా ఎన్నికల్లో ఆయన మచిలీపట్నం నుండి పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు.