బాలయ్య, చిరు కలిసి దిల్ రాజుకు దెబ్బ వేయబోతున్నారా..!!

స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కు దారుణ మైన దెబ్బ పడబోతుందా అంటే అవుననే అంటున్నాయి కోలీవుడ్ మరియు టాలీవుడ్  వర్గాలు. దిల్ రాజు స్టార్ హీరో దళపతి విజయ్ డేట్స్ సంపాదించి , మన డైరెక్టర్ వంశీ పైడిపల్లి ని తో తమిళ్ లో వారీసు గా తెలుగు లో వారసుడుగా  అత్యంత భారీ స్థాయిలో  సినిమా నిర్మిస్తున్నారు.రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్నఈ మూవీ ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది.

హీరో విజయ్ కి వున్న  రెండు రాష్ట్రాల్లో వున్న మార్కెట్ ని దృష్టిలో పెట్టుకుని ఈ మూవీని తెలుగు తమిళ భాషల్లో సంక్రాంతికి కానుక గా  జనవరి 12న విడుదల చేస్తున్నట్టుగా ఇప్పటికే చిత్ర బృందం రిలీజ్ డేట్ ని ప్రకటించేసింది. అయితే సంక్రాంతికి టాలీవుడ్ లో బాలయ్య బాబు వీర సింహ రెడ్డి గా, చిరంజీవి వాల్తేరు వీరయ్య గా వస్తున్నారు.అయితే  దిల్ రాజు కు బడ్జెట్ మరియు థియేటర్స్ ప్రాబ్లెమ్ వల్ల ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉందని అంటున్నారు.

వాల్తేరు వీరయ్య మరియు వీర సింహారెడ్డి సినిమాలు వంద కోట్ల బడ్జెట్ తో కొద్దిగా సేఫ్ జోన్లో ఉన్నాయి. కొద్దిగా టాక్ వస్తే రికవరీ అయ్యే ఛాన్స్ ఉంది. కాని వారసుడు కోసం దిల్ రాజు రూ.250 కోట్ల వరకు పెట్టారట .సంక్రాంతికి రాబోతున్న సినిమాల బడ్జెట్ పరంగా చూసుకుంటే తమిళంలో లో  హీరో అజిత్ వలిమై సినిమా వల్ల, తెలుగు లో చిరు, బాలయ్య వల్ల వారసుడు ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. సంక్రాంతి పండుగకు ఖచ్చితంగా తెలుగు ప్రేక్షకులు చిరంజీవి,బాలయ్య సినిమాలకే మొగ్గు చూపే అవకాశం ఉందని అంటున్నారు.