బాపు బెటా.. లిక్కర్ లో వాటా.. చెప్పాలి కేసీఅర్ కు టాటా : బండి సంజయ్‌

-

బీజేపీ పాదయాత్రకు జనం వస్తలేరని టీఆర్ఎస్​ తప్పుడు ప్రచారానికి తెర లేపిందని తెలంగాణ బీజేపీ చీఫ్​ బండి సంజయ్​ మండిపడ్డారు. ప్రజాసంగ్రామ యాత్రకు జనం రానప్పుడు.. భైంసా సభను ఎందుకు అడ్డుకున్నరని ప్రశ్నించారు. ప్రజాసంగ్రామ యాత్రను చూసి టీఆర్ఎస్​ భయపడుతోందన్నారు. నిర్మల్​ జిల్లా కుంటాల బస్టాండ్​ దగ్గర బహిరంగ సభలో బండి సంజయ్​ మాట్లాడారు. కేసీఆర్​ సభలు, కార్యక్రమాలకు జనం పోవట్లేదని.. పైసలిచ్చి చప్పట్లు కొట్టించుకునే పరిస్థితి ఉందన్నారు. అంతేకాకుండా.. రేపటి నుంచి టీఆర్ఎస్ నేతలను బీజేపీ కార్యకర్తలు వేటాడాలన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మోసం చేసిన టీఆర్ఎస్ నాయకులను నిలదీయాలి అడ్డుకోవాలన్నారు.

- Advertisement -

Image

టీఆర్ఎస్ నాయకులకు కళ్ళు దోబ్బినయి అంటూ బండి సంజయ్‌ విమర్శలు గుప్పించారు. మంది వస్తలేరు అని మంత్రి హరీశ్ రావు అంటున్నారు.. మంది రాక పోతే అనుమతి ఎందుకు ఇవ్వలేదంటూ బండి సంజయ్‌ చురకలు అంటించారు. బాపు బెటా.. లిక్కర్ లో వాటా.. చెప్పాలి కేసీఅర్ కు టాటా… సాలు దోర .. సెలవు దొరా అంటూ నినాదాలు చేశారు బండి సంజయ్‌.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...