బాలయ్య, పవన్ ఫ్యాన్స్ ఫిబ్రవరి 3 కోసం వెయిటింగ్!

-

నందమూరి బాలకృష్ణ అంటే మాస్ కా బాప్,  అభిమానులకు తనని మొన్నటి దాకా థియేటర్స్ లోనే చూసే అవకాశం వుండేది. కాని తాను ప్రస్తుతం టాక్ షో, యాడ్స్ లో కూడా కనిపిస్తూ అలరిస్తున్నాడు. ఇక తన అభిమానులు కాని వారు కూడా ఆహా ఓటిటి లో అన్ స్టాపబుల్ షో  చూసి అందరూ జై బాలయ్య అంటూ గోల గోల చేస్తున్నారు. సీజన్ 1 ఓటిటి లలో రికార్డ్ మోత మోగించింది.

ఇప్పుడు సీజన్ 2 చాలా ఆసక్తికరంగా కొనసాగుతోంది. ఇప్పటికే జరిగిన ఎపిసోడ్స్ ఒక రేంజ్ లో ఉంటే ఇక వచ్చే ఎపిసోడ్స్ ప్రభంజనం సృష్టించే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటికే ప్రభాస్, గోపి చంద్ ఎపిసోడ్స్ సూపర్ గా ఆకట్టుకున్నాయి. ఇక ప్రభాస్ రెండు ఎపిసోడ్స్ దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది.ఇక పవన్ కల్యాణ్ ఎపిసోడ్  ఎపిసోడ్ కూడా షూటింగ్ పూర్తి చేసుకొని రెడీగా ఉంది.

పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ప్రోమోను  నిన్న రిలీజ్ చేశారు. అయితే ఈ షోలో తనదైన స్టైల్ లో రాజకీయంగా సినిమా పరంగా ప్రశ్నలు అడగడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.పవన్ కల్యాణ్ కి సంబంధించిన ఈ ఇంటర్వ్యూను రెండు ఎపిసోడ్లుగా గా మార్చారట. మొదటి ఎపిసోడ్  ఫిబ్రవరి 3వ తేదీన ప్రసారం చేసేందుకు ప్లాన్ చేయబోతున్నట్లు సమాచారం. ఫ్యాన్స్ ఈ ఎపిసోడ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news