బాలయ్య బాబు ప్లానింగ్ సూపర్ గురూ..!!

-

నందమూరి బాలకృష్ణ అంటే మాస్ కా బాప్,  అభిమానులకు తనని మొన్నటి దాకా థియేటర్స్ లోనే చూసే అవకాశం వుండేది. కాని తాను ప్రస్తుతం టాక్ షో, యాడ్స్ లో కూడా కనిపిస్తూ అలరిస్తున్నాడు. ఇక తన అభిమానులు కాని వారు కూడా ఆహా ఓటిటి లో అన్ స్టాపబుల్ షో  చూసి అందరూ జై బాలయ్య అంటూ గోల గోల చేస్తున్నారు. సీజన్ 1 ఓటిటి లలో రికార్డ్ మోత మోగించింది.

ఇప్పుడు సీజన్ 2 చాలా ఆసక్తికరంగా కొనసాగుతోంది. ఇప్పటికే జరిగిన ఎపిసోడ్స్ ఒక రేంజ్ లో ఉంటే ఇక వచ్చే ఎపిసోడ్స్ ప్రభంజనం సృష్టించే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటికే ప్రభాస్, గోపి చంద్ ఎపిసోడ్స్ సూపర్ గా ఆకట్టుకున్నాయి. ఇక ప్రభాస్ రెండు ఎపిసోడ్స్ దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది..ఇక పవన్ కల్యాణ్ ఎపిసోడ్  ఎపిసోడ్ కూడా షూటింగ్ పూర్తి చేసుకొని రెడీగా ఉంది.

ఇక్కడే బాలయ్య తన మాస్టర్ మైండ్ కు పదును పెట్టారు. పవన్ ఎపిసోడ్ వల్ల కొన్ని వ్యూస్ పెరుగుతాయి కాని తనకు వచ్చేది ఏమి లేదని కరెక్ట్ గా సంక్రాంతి పండుగ సీజన్ లో తన సినిమా వీరసింహరెడ్డి ప్రమోషన్ కోసం పక్కాగా ఉపయోగించుకోవాలని ప్లాన్ వేశాడు బాలయ్య.ఇప్పటికే తన సినిమా టీం తో షూటింగ్ పూర్తి అయింది. వచ్చే శుక్రవారం నాడు రిలీజ్ అవబోతుంది. ఇక  వీరసింహారెడ్డి` సినిమా సంక్రాంతి కానుకుగా ఈ నెల 12న విడుదల కాబోతుంది. ఇప్పటికే సినిమాకి భారీ బుకింగ్స్ వస్తున్నాయి. ఈ టాక్ షో వల్ల ఇంకా కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news