“వాల్తేరు వీరయ్య” మూవీ నుంచి 5వ పాటకు ముహుర్తం ఫిక్స్‌

-

టాలీవుడ్‌ మెగాస్టార్‌ చిరంజీవి వరుస సినిమాలతో కుర్ర హీరోలకు పోటీ ఇస్తున్నారు. ప్రస్తుతం చిరంజీవి వాల్తేరు వీరయ్య మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమా నుంచి ఎప్పటికప్పుడు బయటకొస్తున్న అప్‌డేట్స్ మెగా అభిమానుల్లో జోష్ పెంచుతున్నాయి.

కేఎస్‌ రవింద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్‌ కానుంది. ఇప్పటికే మేకర్స్‌ రిలీజ్‌ చేసిన పోస్టర్‌లు, పాటలు సినిమాపై విపరీతమైన అంచనాలు క్రియేట్‌ చేశాయి. పైగా ఈ సినిమాలో రవితేజ కీలకపాత్ర పోషిస్తుండటంతో అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి.  అయితే, తాజాగా వాల్తేరు వీరయ్య ఐదో పాటకు సంబంధించిన అప్టేట్‌ ను వదలింది చిత్ర బృందం. నీకేమో అందమెక్కువ అంటూ సాగే పాటను జనవరి 11న ఉదయం 10.35 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ మేరకు ఓ పోస్టర్‌ రిలీజ్‌ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news