VIDEO : పునీత్ కు నివాళ్ల‌ర్పించి ఏడ్చేసిన బాల‌య్య‌..!

-

కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ నిన్న ఉదయం 11 గంటలకు గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. కాగా ఈరోజు పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో టాలీవుడ్ నుండి ప్రముఖులు పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలకు హాజరయ్యారు. బాలకృష్ణ, ఎన్టీఆర్, మెగాస్టార్ చిరంజీవి అంత్యక్రియలకు హాజరు అవుతున్నారు. బాలయ్య ఇప్ప‌టికే అక్కడకు చేరుకోగా పునీత్ తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకొని కన్నీరు పెట్టుకున్నారు.

balayya crying with puneeth rajkumar family

పునీత్ రాజ్ కుమార్ అన్న శివ రాజ్ కుమార్ ను పట్టుకొని బాలయ్య ఎడ్చేశారు. అనంతరం పునీత్ కుటుంబ సభ్యులను బాలయ్య ఓదార్చారు. దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక బాలయ్య కు పునీత్ రాజ్ కుమార్ కుటుంబంతో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఈ విషయాన్ని ఆయన ఓ ఇంటర్వ్యూలో కూడా వెల్లడించారు. ఇదిలా ఉంటే పలువురు బాలీవుడ్ ప్రముఖులు కూడా పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలకు హాజరయ్యేందుకు బెంగళూరు బయలుదేరినట్టు తెలుస్తోంది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news