ఆర్యఖాన్ రిలీజ్ పై RGV సంచలన ట్వీట్… !

-

వివాదస్పద దర్శకుడు రాం గోపాల్‌ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎప్పుడూ ఏదో విషయంపై ట్వీట్లు చేస్తూ… వార్తలల్లో తరచూ నిలుస్తారు రాం గోపాల్‌ వర్మ. ఇక రాంగోపాల్ వర్మ ఏది చేసినా సంచలనమే. వెండితెరపై సినిమా తీసినా… ఓటిటీలో వెబ్ సిరీస్ రూపొందించిన ఆయన స్టైలే వేరు. ఇంకా బయోపిక్ సినిమాల నిర్మాణం లో రాంగోపాల్ వర్మ టేకింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

అయితే.. తాజాగా బాలీవుడ్‌ స్టార్‌ హీరో షారుఖ్‌ ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌ జైలు నుంచి విడుదల కావడం పై రాం గోపాల్‌ వర్మ ఆసక్తిక ర ట్వీట్‌ చేశారు. ” బాలీవుడ్‌ చిత్ర పరిశ్ర మలో షారుఖ్‌ ఖాన్‌ కు ప్రత్యేకమైన గుర్తిం పు ఉంది. ప్రతీ దీపావళి ఏదో ఒక సినిమాతో షారుఖ్‌ ఖాన్‌ వస్తారు. అయితే.. ఈ సారి మాత్రం… ఖాన్‌ సినిమా విడుదల అయింది” అంటూ వర్మ ట్వీట్‌ చేశారు. కాగా.. కాసేపటి క్రితమే… ఆర్యన్‌ ఖాన్‌.. ముంబై లోని జైలు నుంచి విడుదల అయిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news