ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్ ఇంటి ముందు అనగా (లోటస్ పాండ్) ముందు అక్రమ నిర్మాణాలను శనివారం కూల్చివేసిన విషయం తెలిసిందే. అయితే అక్రమ నిర్మాణాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు అని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ నేతలు ఇష్టమొచ్చినట్టు మాట్లాడి ఇప్పుడు మాత్రం మాట్లాడకపోవడం గమనార్హం.
తాజాగా ఏపీ మాజీ సీఎం జగన్ ఇంటి ముందు అక్రమ నిర్మాణాల కూల్చివేతపై బల్దియా కమిషనర్ సీరియస్ అయ్యారు. ఖైరతాబాద్ జోనల్ కమిషనర్, ఐఏఎస్ అధికారి హేమంత్ బోర్కడే పై బదిలీ వేటు పడింది. ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకుండా కూల్చివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ మంత్రి ఆదేశాలతో జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేతలకు దిగినట్లు తెలుస్తోంది. ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ హేమంత్ ను జీఐడీకి రిపోర్ట్ చేయాలని ఆదేశించారు.