కొత్త స్పీకర్‌ను నిర్ణయించేది నేను కాదు : ఓం బిర్లా

-

కొత్తగా కొలువుదీరనున్న 18వ లోక్‌సభకు స్పీకర్‌ ఎవరో నిర్ణయించేది తాను కాదని 17వ లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లా అన్నారు. లోక్‌సభ నూతన స్పీకర్‌గా, డిప్యూటీ స్పీకర్‌గా ఎవరిని నియమించబోతున్నారన్న మీడియా ప్రశ్నకు ఓం బిర్లా పైవిధంగా సమాధానం ఇచ్చారు. స్పీకర్‌ నియామకానికి, డిప్యూటీ స్పీకర్‌ నియమకానికి సంబంధించి అన్ని నిర్ణయాలు తీసుకునేది రాజకీయ పార్టీలని, ఆ నిర్ణయాలు తాను తీసుకునేవి కావని ఓం బిర్లా చెప్పారు.

ఈ నెల 24న 18 లోక్‌సభ కొలువుదీరబోతోంది. రెండు రోజుల్లో ప్రొటెం స్పీకర్ ఎంపిక, ఎంపీల ప్రమాణస్వీకారాలు పూర్తిచేసి ఈ నెల 26న లోక్‌సభ స్పీకర్‌ను, డిప్యూటీ స్పీకర్‌ను ఎన్నుకోనున్నారు. ఈ నేపథ్యంలో కాబోయే స్పీకర్‌ ఎవరే విషయంలో జోరుగా చర్చ జరుగుతోంది. అధికార పార్టీ ఎంపీనే స్పీకర్‌ అవుతారని కొందరు, ప్రతిపక్ష పార్టీలకు స్పీకర్‌ పదవి దక్కుతుందని కొందరు అంటున్నారు. ఈ విషయాన్ని ఓం బిర్లా ముందు ప్రస్తావించడంతో ఆయన ఇలా స్పందించడం విశేషం.

Read more RELATED
Recommended to you

Latest news