ప్రముఖ గాయకులూ ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం మరణంతో సంగీత ప్రపంచం నివ్వెర పోయింది. ఆయనతో ఉన్న జ్ఞాపకాలను తాజాగా ప్రముఖ తెలుగు పాప్ సింగర్ స్మిత సోషల్ మీడియాలో పంచుకున్నారు. 1997 లో ఇంటర్ చదివే రోజుల్లో ఆమె పాడుతా తీయగా అనే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలుతో ఆమె జరిపిన ఒక సంభాషణకు సంబంధించిన వీడియో పోస్ట్ చేసారు.
నేను మిమ్మల్ని ఎలా మరువగలను బాలు గారూ అంటూ ఆమె పోస్ట్ చేసారు. మీ దీవెనలతోనే నా సంగీత ప్రయాణం మొదలయింది అంటూ ఆమె పేర్కొన్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని బాలు అడగడం విజయవాడ నుంచి వచ్చా అని ఆమె చెప్పడం ఆ తర్వాత పాట పాడగా అది బాలుకి నచ్చడం జరిగాయి. ఈ వీడియో బాగా వైరల్ అవుతుంది.
How can I ever forget you Balu garu, it was with your blessings that I started my journey in music in 1997. You not only…
Posted by Smita on Friday, 25 September 2020