హర్యానా గవర్నర్‌గా దత్తాత్రేయ ప్రమాణం

హర్యానా గవర్నర్‌గా బండారు దత్తాత్రేయ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. చంఢీగఢ్‌ ప్రధాన న్యాయమూర్తి దత్తాత్రేయతో ప్రమాణం చేయించారు.చంఢీగఢ్‌లోని రాజ్‌భవన్‌లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్, డిప్యూటీ సీఎం దుష్యంత్ చౌతాలా హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం అనంతరం దత్తాత్రేయ హర్యానా 18వ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టారు.

కాగా హిమాచల్ ప్రదేశ్‌ గవర్నర్‌గా పని చేస్తున్న దత్తాత్రేయ ఇటీవలే హర్యానాకు బదిలీ అయిన విషయం తెల్సిందే. తాజాగా రాజేంద్ర అర్లేకర్‌ హిమాచల్ ప్రదేశ్‌ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల మొత్తం 8 రాష్ట్రాలకు కొత్త గ‌వ‌ర్నర్లను నియ‌మించిన విషయం తెల్సిందే. ఇందులో ద‌త్తాత్రేయ‌కు స్థాన చ‌ల‌నం కలగగా… ఏపీ బీజేపీ నేత కంభంపాటి హ‌రిబాబుకు గ‌వ‌ర్నర్ ప‌ద‌వి వ‌రించింది. మిజోరం గ‌వ‌ర్నర్‌గా కంభంపాటి హ‌రిబాబును నియమితులయ్యారు.