మా ఎన్నిక‌లు, మా భ‌వ‌నంపై బాంబు పేల్చిన బాల‌య్య ..!

‘మా’ ఎన్నికలు ఈ సారి రసవత్తరంగా సాగుతున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ ఎన్నికలపై నందమూరి బాలకృష్ణ తాజాగా బాంబు పేల్చాడు. ‘మా’ ఎన్నికల విషయంలో లోకల్‌, నాన్‌ లోకల్‌ అనే అంశాన్ని పట్టించుకోననని… ఆయన స్పష్టం చేశారు. మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (‘మా’) ఎన్నికల గురించి బాలకృష్ణ ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

‘మా’ ఎన్నకలు, శాశ్వత భవనంతో పాటు మరికొన్ని అంశాల గురించి ఓ ఛానల్‌ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రస్తావించారు. గతంలో ‘మా’ ఫండ్‌ రైజింగ్‌ కార్యక్రమాలు అంటూ…. ఫస్ట్‌ క్లాస్‌ టికెట్లు వేసుకుని విమానాల్లో తిరాగారని.. ఆ డబ్బులు.. ఏం చేశారని బాలయ్య నిలదీశారు.

‘మా’ కు శాశ్వత భవనాన్ని ఇంతకాలం ఎందుకు నిర్మించలేకపోయారని ప్రశ్నించిన బాలకృష్ణ.. తెలంగాణ ప్రభుత్వం నుంచి ఒక్క ఎకరం భూమిని కూడా సంపాదించలేకపోయారా అని చురకలు అంటించారు. అంతేకాదు.. అందరం కలిస్తే.. ‘మా’ కోసం…. అద్భుతమైన భవనాన్ని నిర్మించుకోవచ్చని బాలకృష్ణ స్పష్టం చేశారు.