బండారు పిటిషన్ పై విచారణ ఈ నెల 5కి వాయిదా

-

టీడీపీ నేత బండారు సత్యనారాయణ ఏపీ మంత్రి రోజాపై తీవ్ర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే.. తన అరెస్ట్ అక్రమని బండారు సత్యనారాయణమూర్తి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో.. రెండు కేసుల్లో 41ఏ కింద నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేశారని, నోటీసులు ఇచ్చి ఎలా అరెస్ట్ చేస్తారని ఇవాళ విచారణ సందర్భంగా బండారు తరఫు న్యాయవాది హైకోర్టులో తమ వాదనలు వినిపించారు. అయితే, పోలీసులు నోటీసులు ఇవ్వలేదని ప్రభుత్వం తరఫు న్యాయవాదులు కోర్టుకు విన్నవించారు.

వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం… బండారు తన పిటిషన్ లో పేర్కొన్న అంశాలపై కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. అదే సమయంలో, పోలీసుల అరెస్ట్ ప్రొసీజర్ పై కౌంటర్ దాఖలు చేయాలని బండారు తరఫు న్యాయవాదులను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 5కి వాయిదా వేస్తున్నట్టు తెలిపింది.

అయితే.. మరోవైపు ఉదయం గుంటూరు నగరంపాలెం పీఎస్‌ వద్ద పోలీసుల ఆంక్షలు విధించారు. బండారు సత్యనారాయణ హైబీపీ, మధుమేహంతో బాధపడుతున్నారు. మందులు ఇచ్చేందుకు ఆయన తనయుడు అప్పలనాయుడు స్టేషన్‌కు వచ్చారు. తండ్రిని కలిసేందుకు అప్పలనాయుడికి పోలీసులు అనుమతి ఇవ్వలేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version