కోర్టును తప్పుదారి పట్టించే విధంగా ప్రభుత్వం వ్యవహరించింది : బండి సంజయ్‌

-

ప్రజా సంగ్రామ పాదయాత్ర మూడో విడత ముగింపు సభకు అనుమతినిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ స్వాగతించారు. చట్టాన్ని, రాజ్యాంగాన్ని గౌరవిస్తామని చెప్పారు. కోర్టును తప్పుదారి పట్టించే విధంగా ప్రభుత్వం వ్యవహరించిందని బండి మండిపడ్డారు. సభ కోసం ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ ను ముందే బుక్ చేసుకున్నా, పై నుంచి వచ్చిన ఒత్తిడి వల్ల ప్రిన్సిపల్ అనుమతి రద్దు చేస్తామని చెప్పారని అన్నారు. సభ ఏర్పాట్లు 90 శాతం పూర్తైనట్లు చెప్పిన సంజయ్.. తన పాద యాత్ర సాయంత్రానికి భద్రకాళి టెంపుల్ కు చేరుకుంటుందని చెప్పారు. జేపీ నడ్డాతో కలిసి అమ్మవారి దర్శనం చేసుకుని సభాస్థలికి వెళ్తామని ప్రకటించారు. శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందనే సాకుతో పోలీసులు ఆంక్షలు విధించారని బండి సంజయ్ మండిపడ్డారు.

బహిరంగ సభకు ప్రజలు తండోపతండాలుగా తరలివస్తారని.. సీఎం కేసీఆర్ తమ సభను చూడాలని సూచించారు. నిర్భందాలకు వ్యతిరేకంగా కార్యకర్తలు తరలివస్తున్నారని వెల్లడించారు. పాదయాత్రలో పోలీసులు జరిపిన లాఠీఛార్జీలో ముగ్గురు కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయని.. వారు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంపై యుద్ధం ప్రారంభమైందన్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version