‘బండి’ పాత రూట్‌లో…కొత్తది చూసుకుంటే బెటర్!

-

మళ్ళీ అవే విమర్శలు…అవే మాటలు…కేసీఆర్ త్వరలోనే జైలుకు వెళ్తారు…కేసీఆర్‌కు పాకిస్తాన్‌తో సంబంధాలు ఉన్నాయని.. పాడిన పాటే మళ్ళీ మళ్ళీ పాడుతున్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్…అసలు గతంలో ఇదే తరహా విమర్శలు అనేక సార్లు చేశారు. ఇలాంటి చేసిన విమర్శలనే మళ్ళీ మళ్ళీ చేయడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదనే చెప్పాలి.

Bandi Sanjay Kumar | బండి సంజ‌య్

ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ చాలా దూకుడుగా ముందుకెళుతున్నారు…బీజేపీని అన్నివైపులా ఇరుకున పెట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. బీజేపీ వల్ల దేశమే నాశనమైపోతుందనే కోణం తీసుకొస్తున్నారు. అసలు బీజేపీని గట్టిగా టార్గెట్ చేస్తున్నారు..పైగా తాజాగా అసోం సీఎం…రాహుల్ గాంధీపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలని తీవ్రంగా ఖండిస్తూ, అనూహ్యంగా కాంగ్రెస్‌కు మద్ధతు తెలిపినట్లు కేసీఆర్ రాజకీయం నడిచింది. ఈ క్రమంలో బీజేపీకి కాస్త ఇబ్బందికర పరిస్తితులు వచ్చాయి.

అయితే కేసీఆర్ విమర్శలకు చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది…అందుకే బండి సంజయ్ తనదైన శైలిలో కౌంటర్లు ఇవ్వడం మొదలుపెట్టారు. సర్జికల్‌ స్ట్రైక్స్‌ జరగలేదంటూ జవాన్ల త్యాగాలను కించపరిచేలా మాట్లాడిన కేసీఆర్‌కు ఏ మాత్రం సిగ్గున్నా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. కేసీఆర్‌ లాంటి ద్రోహికి తెలంగాణ గడ్డమీద ఉండే అర్హత లేదని, ఆయన్ను ప్రజలు తరిమికొట్టడం ఖాయమని, కేసీఆర్‌కు ఐ‌ఎస్‌ఐతో సంబంధాలున్నాయని తీవ్ర ఆరోపణ చేశారు. అంటే ఇలా దేశద్రోహి అన్నట్లు విమర్శలు చేయడం వల్ల పెద్దగా ప్రయోజనం లేదనే చెప్పొచ్చు.

ఎందుకంటే బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడితే చాలు…దేశంలో బీజేపీ నేతలంతా ప్రత్యర్ధులపై ఇదే తరహా కామెంట్లు చేస్తున్నారు. వ్యతిరేకంగా మాట్లాడితే దేశద్రోహి అని అనేస్తున్నారు. ఇక ఇలాంటి విమర్శలని ప్రజలు నమ్మే పరిస్తితుల్లో లేరు..పదే పదే ఇలాగే మాట్లాడటం వల్ల ప్రయోజనం లేదనే చెప్పాలి..తెలంగాణ సమస్యలపైన, కేసీఆర్ విఫల్యాలపైన, ఎమ్మెల్యేల అక్రమాలు పైన విమర్శలు చేస్తే ఏమన్నా ఉపయోగం ఉంటుంది. మరి ఇకనుంచైనా బండి సంజయ్ కొత్త రూట్‌లోకి వస్తారేమో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version