కేసీఆర్‌కు దేశంలో ఉండే అర్హత లేదు : బండి సంజయ్

-

‘అంబేడ్కర్, గవర్నర్, రాజ్యాంగం, కోర్టులు, మహిళలకు కేసీఆర్ గౌరవం ఇవ్వడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. రాజ్యాంగ స్ఫూర్తితో ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తుంటే.. తెలంగాణ సీఎం కేసీఆర్‌ రాజ్యాంగానికి విరుద్ధంగా పాలన సాగిస్తున్నారని విమర్శించారు. రేడ్ మైదానంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను సీఎం ఎందుకు నిర్వహించడం లేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా అని నిలదీశారు. రాజ్యాంగాన్ని అవమానించిన కేసీఆర్‌కు దేశంలో ఉండే అర్హత లేదు’’ అని బండి సంజయ్ అన్నారు.

అంబేడ్కర్ అద్భుతమైన రాజ్యాంగాన్ని అందించారని బండి సంజయ్ అన్నారు. మోదీ పాలనలో రాజ్యాంగ స్ఫూర్తి చెక్కు చెదరలేదని చెప్పారు. రాజ్యాంగ స్ఫూర్తితో నరేంద్ర మోదీ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్యాంగ విరుద్ధంగా పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ కల్వకుంట్ల రాజ్యాంగాన్ని అమలు చేయాలనుకుంటున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి తానో నిజాంలా వ్యవహరిస్తున్నారని బండి సంజయ్ విమర్శలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news