బాలయ్య తాజాగా నటించిన వీర సింహారెడ్డి సినిమా సక్సెస్ అవ్వడంతో వీర సింహుని విజయోత్సవం పేరిట ఒక సక్సెస్ మీట్ నిర్వహించారు. ఇందులో ఫ్లోలో అక్కినేని తొక్కినేని అని బాలయ్య అన్న మాటలు ఇప్పుడు అక్కినేని అభిమానులకు ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి. అంతేకాదు అక్కినేని వారసులు కూడా ఈ విషయంపై స్పందించి బాలకృష్ణకు పరోక్షంగా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే బాలయ్య ఈ వ్యాఖ్యలను అనలేదు అని అలా మాట్లాడుకునే వాళ్ళు కూడా కామెంట్లు చేస్తూ రకరకాలుగా ఆయనను తప్పించే ప్రయత్నం చేస్తున్నారు.
బాలకృష్ణ అలా ఉద్దేశించి మాట్లాడలేదు అని స్వర్గీయ ఎస్సీ రంగారావు మనవళ్లు కూడా బాలకృష్ణకు మద్దతుగా నిలిచారు. ఇదిలా వుండగా తాజాగా అన్నపూర్ణ స్టూడియో వారు బాలయ్య పై బ్యాన్ విధించారు అంటూ వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి.. నిజానికి సినిమాలతో పాటు పలు షోల షూటింగ్స్ హైదరాబాదులోని అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆహా నిర్వహిస్తున్న బాలయ్య షో అన్ స్టాపబుల్ కూడా అక్కడే జరుగుతుంది.
ఇప్పుడు బాలయ్య అక్కినేని వారిపై అలా అనుచిత వ్యాఖ్యలు చేయడంతో అన్ స్టాపబుల్ తొమ్మిదవ ఎపిసోడ్ ను అన్నపూర్ణ స్టూడియోలో నిర్వహించకూడదని బాలయ్యను స్టూడియోలోకి అడుగు పెట్టనివ్వమని అన్నపూర్ణ స్టూడియో వారు చెప్పినట్టు రకరకాల వార్తలు బయటకు వచ్చాయి. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ వార్తలన్నీ వట్టి పుకార్లే అని అన్నపూర్ణ స్టూడియో నిర్వహకులు క్లారిటీ ఇచ్చారు. సోషల్ మీడియాలో వినిపిస్తున్నవి వదంతులు మాత్రమే అని ఇలాంటి మాటలు పట్టించుకోవద్దు అని కూడా క్లారిటీ ఇచ్చారు.
“Mansion house balayya…
brand marchayyaa…
thikka thikka ga matladithey eepu paguludhayya…”– Nellore Akkineni fans🔥🔥😂#MentalBalaKrishna #BanBalaKrishnaFromTFI https://t.co/Ct34QZWO4K pic.twitter.com/qpXKn3lb57
— 👑NAG (@priyathamKING) January 25, 2023