పలు నాటకీయ పరిణామాల నేపథ్యంలో మూడు రోజుల బ్రేక్ తర్వాత బండి సంజయ్ ప్రజా సంగ్రామ పాదయాత్ర తిరిగి ప్రారంభించారు. కవిత ఇంటి పై దాడి, రాజాసింగ్ అరెస్ట్, బండి సంజయ్ అరెస్టుతో తెలంగాణలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న సంగతిి తెలిసిందే. ఈ క్రమంలో బండి సంజయ్ ని హౌస్ అరెస్టు చేసిన పోలీసులు.. పాదయాత్రకు అనుమతి నిరాకరించారు.
బిజెపి నేతలు హైకోర్టును ఆశ్రయించగా గ్రీన్ సిగ్నల్ దక్కింది. దాంతో ఆగిన చోటు నుంచే బండి సంజయ్ శుక్రవారం పాదయాత్ర ప్రారంభించారు. జనగామ జిల్లా జఫర్గడ్ మండలం పామునూరు నుంచి బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభించారు. అయితే
బండి సంజయ్ పాదయాత్ర జనగామ జిల్లా కూనూరు కు చేరుకోగానే మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది.
ఓ వ్యక్తి బండి సంజయ్ పై దాడి చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో బిజెపి కార్యకర్తలు అతడిని అడ్డుకొని చితకబాదారు. దీంతో మళ్లీ టిఆర్ఎస్, బిజెపి కార్యకర్తలకు మధ్య వాగ్వాదం నెలకొని కర్రలతో దాడి చేసుకున్నారు. దీంతో పోలీసులు ఇరువర్గాలపై లాటి చార్జ్ చేసి చెదరగొట్టారు.