సీబీఎన్ గ్రాటిట్యూడ్ కాన్సెర్ట్ లో కంటతడి పెట్టిన బండ్ల గణేష్

-

హైటెక్ సిటీ సైబర్ టవర్స్ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో భాగంగా తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కు కృతజ్ఞతలు చెప్పేందుకు ఐటీ ఉద్యోగులు హైదరాబాదులో సీబీఎన్ గ్రాటిట్యూడ్ కాన్సెర్ట్ ఏర్పాటు చేశారు. టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ బృందం తమ సంగీత ప్రదర్శనతో సభకు వచ్చినవారిని ఉర్రూతలూగించింది.

కాగా, ఈ కార్యక్రమానికి టాలీవుడ్ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ కూడా వచ్చారు. ఆయన వేదికపై ప్రసంగిస్తూ చంద్రబాబును వేనోళ్ల కొనియాడారు. ఓ దశలో తీవ్ర భావోద్వేగాలకు లోనైన ఆయన కంటతడి పెట్టారు. “నేను వినాయకచవితి పండుగ చేసుకోలేదు, దసరా పండుగ చేసుకోలేదు… దీపావళి పండుగ అద్భుతంగా చేసుకునే అవకాశం కల్పించాలని భగవంతుడ్ని కోరుకుంటున్నాను. చంద్రబాబు… అది పేరు కాదు బ్రాండ్. బ్రాండ్ కూడా కాదు, మనిషి కూడా కాదు… దేవుడు.

ఆయన దేవుడు అని ఎందుకు చెబుతున్నానంటే… మా సొంతూరు ఉమ్మడి గుంటూరు జిల్లా పొన్నూరు దగ్గర్లోని ఓ ఊరు. నాకు ఎనిమిది నెలల వయసున్నప్పుడు మేం అక్కడ్నించి బతకడానికి ఎక్కడికో వలస వచ్చాం. అప్పుడప్పుడు మా ఊరికి వెళ్లొస్తుండేవాడ్ని. మా బంధువులందరూ పాడి పశువులతో ఉపాధి పొందుతూ, గుంటూరు, పొన్నూరులో ఉంటూ పిల్లలను ట్యూషన్ చేర్పించి చదువు చెప్పించేవాళ్లు.

కొన్నాళ్ల తర్వాత చూస్తే… మా ఊరి నుంచి పొన్నూరుకు కాలినడకన, ఆటోల్లో వచ్చే మా పిన్ని వాళ్లు విమానాలెక్కి అమెరికా వెళుతున్నారు. ఏం పిన్ని ఎక్కడికి వెళుతున్నావు అంటే… అమ్మాయి సాఫ్ట్ వేర్ కదరా, అల్లుడు సాఫ్ట్ వేర్ కదరా… అమెరికా వెళుతున్నాను అని చెబుతుంటే కడుపు నిండిపోయినట్టయ్యేది. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటూ… ఇవాళ మనవాళ్లు దేశవిదేశాల్లో ఐటీ ఉద్యోగాలతో బతుకుతున్నారంటూ దాని వెనుక చంద్రబాబు కృషి ఉంది.

 

Read more RELATED
Recommended to you

Latest news