బండ్ల గణేష్ షాకింగ్ నిర్ణయం.. ఇక పై !

టాలీవుడ్ స్టార్ నిర్మాత బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎందుకంటే బండ్ల గణేష్ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు కమెడియన్ గా మరియు నిర్మాత గా పరిచయం ఉన్న వ్యక్తి. ఒకప్పుడు సినిమా ఫంక్షన్ల వేదికలపై మాట్లాడిన స్పీచులు గుర్తుకు వచ్చేవి. ఇప్పుడైతే రాజకీయాల్లోకి మాట్లాడిన మాటలు గుర్తుకు వస్తాయి. రాజకీయాల్లోకి దిగి.. కోటలు దాటే మాటలతో నవ్వుల పాలయ్యాడు. బండ్ల గణేష్ కాస్తా.. బ్లేడ్ గణేష్ అనే స్థాయికి దిగజారిపోయాడు.

producer bandla ganesh posts his corona negative report

అయితే తాజాగా నిర్మాత బండ్ల గణేష్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన ట్విట్టర్ ఖాతాను త్వరలోనే తొలగిస్తున్నారని… ఇక ట్విట్టర్ కి గుడ్ బాయ్ చెప్పబోతున్నట్లు స్పష్టం చేశారు బండ్ల గణేష్. నో కాంట్రవర్సీస్… నా లైఫ్ లో అలాంటి వాటికి చోటు లేదు అంటూ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు బండ్ల గణేష్. ప్రస్తుతం ఈ ట్రీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అయితే బండ్ల గణేష్.. ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు.