బిగ్‏బాస్ బ్యూటీ అరెస్ట్

తమిళ చిత్ర పరిశ్రమ నుంచి దళితులను పరిశ్రమ నుంచి తరిమివేయాలని ఇటీవల బిగ్ బాస్ డ్యూటీ మీరా మిథున్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే దళితులను కించపరిచేలా ఆమె పై ఎస్సీ మరియు ఎస్టీ అట్రాసిటీ కేసులు ఇటీవల నమోదయ్యాయి. అయితే ఈ కేసులో పై విచారణకు హాజరు కావలసిందిగా మీరా మిథున్…. కు తమిళనాడు పోలీసులు నోటీసులు జారీ చేశారు.

నోటీసులు జారీ చేసినప్పటికీ మీరా మిథున్ స్పందించలేదు. పోలీసుల నోటీసులను బేఖాతరు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మీరా మిథున్ ను తాజాగా అరెస్టు చేశారు. మీరా మిథున్ ను కేరళ రాష్ట్రంలో పోలీసులు అరెస్టు చేశారు. విచారణ నిమిత్తం చెన్నై కి తరలించారు. అయితే ఈ అరెస్టుపై మీరా మిథున్ స్పందిస్తూ…. తనను అరెస్టు చేయడం అనేది జరిగే పని కాదని పేర్కొంది. సాధ్యమైతే తనను నిర్భయంగా అరెస్టు చేసుకోవచ్చని…. వెల్లడించింది మీరా మిథున్. తన వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పు లేదని స్పష్టం చేసింది.