బెంగళూరు డ్రగ్స్ కేసుకు హైదరాబాద్ లింకులు.. త్వరలో ఎమ్మెల్యేలకు నోటీసులు ?

బెంగళూరు డ్రగ్స్ కేసులో హైదరాబాద్ కు చెందిన ఇద్దరు వ్యాపారవేత్తలు ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్కు చెందిన సందీప్ రెడ్డి, కలహర్ రెడ్డి అనే ఇద్దరు వ్యక్తుల ప్రమేయం ఉన్నట్లు కర్ణాటక పోలీసులు గుర్తించారు. ఇప్పటికే పొలీసులు సందీప్ రెడ్డిని విచారించినట్టు చెబుతున్నారు. ఈ ఇద్దరూ కలిసి బెంగళూరులో పబ్ బిజినెస్ చేస్తున్నారని పొలీసులు గుర్తించారు. తెలంగాణకు చెందిన ప్రముఖులకు కూడా ఈ ఇద్దరూ ఎక్కువగా పార్టీలు ఇస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

ఇద్దరికీ కన్నడ సినీ పరిశ్రమ తో కూడా సంబంధాలు ఉన్నాయని కొన్ని సినిమాలకు ఫైనాన్స్ కూడా చేస్తున్నారని పోలీసులు గుర్తించారు. గతంలో డ్రగ్స్ కేసులో పట్టుబడిన కన్నడ నిర్మాత శంకర్ గౌడ్ తో పాటు కొన్ని సినిమాలకు ఫైనాన్స్ చేసినట్లు గుర్తించారు.. సందీప్ కలర్ ఇద్దరు శంకర్ గౌడ్ తో కలిసి నైజీరియన్ వద్ద ఈ డ్రస్ కొనుగోలు చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. అలానే వీరు కొందరు ఎమ్మెల్యేలకు నేరుగా డ్రగ్స్ సప్లై చేసినట్టు సమాచారం. దీంతో వీరి వద్ద ఉన్న సమాచారం తో ఆ ఎమ్మెల్యేలను ప్రశ్నించే అవకాశం ఉందని అంటున్నారు.