సోషల్ మీడియాను ఎక్కువగా ఉపయోగించుకోవడంలో పేరుగాంచిన బెంగళూరు పోలీసులు మరో కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. ఇకపై టిక్‌టాక్‌లో వారు సేవలు అందించనున్నారు. ఈ మేరకు బెంగళూరు పోలీసులు తాజాగా ఓ టిక్‌టాక్ అకౌంట్‌ను ఓపెన్ చేశారు.
టిక్‌టాక్ అకౌంట్‌ను ఓపెన్ చేసిన సందర్భంగా బెంగళూరు సౌత్ ఈస్ట్ డీసీపీ ఇషా పంత్ మాట్లాడుతూ.. టిక్‌టాక్ ప్రస్తుతం బాగా ఆదరణ పొందిన సోషల్ మీడియా యాప్ అని, అందులో యువత ఎక్కువగా కాలక్షేపం చేస్తున్నారని, అందుకనే వారికి చేరవయ్యేందుకు టిక్‌టాక్ ఉపయోగపడుతుందని భావించి తాము కూడా అందులో అకౌంట్‌ను ఓపెన్ చేశామని తెలిపారు.
కాగా బెంగళూరు పోలీసులు ఇప్పటికే ట్విట్టర్‌లో నిర్వహిస్తున్న ఖాతాకు అక్కడి ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తుండగా, ఇప్పుడు టిక్‌టాక్ ద్వారా వారికి మరింత చేరువ కానున్నారు. ఇక బెంగళూరు మాత్రమే కాదు, ఇప్పటికే కేరళ, ఉత్తరాఖండ్, దుర్గ్ తదితర ప్రాంతాల్లో పోలీసులు టిక్‌టాక్ అకౌంట్లను ఓపెన్ చేసి జనాలకు నిత్యం టచ్‌లో ఉంటున్నారు..!